తాప్సీ చేతి మీద పెళ్ళిళ్లు జరగవేమోలే!!

Update: 2016-09-29 12:27 GMT
ఢిల్లీ బ్యూటీ తాప్సీ పన్ను ఇప్పుడు కెరీర్ లోనే పీక్ స్టేజ్ లోకి వచ్చేసింది. పింక్ మూవీతో ఈమె సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకూ ఈమె అందాన్ని తప్ప ట్యాలెంట్ చూపించే అవకాశం రాలేదు. ఇప్పుడు వరుసగా వస్తున్న అవకాశాల్లో తన ప్రతిభకు తగిన వాటినే ఎంచుకుంటూ దూసుకుపోవాలని డిసైడ్ అయింది తాప్సీ. అయితే.. ఈ సక్సెస్ టేస్ట్ చేయకముందు.. చెల్లితో కలిసి ఓ వ్యాపారం స్టార్ట్ చేసింది ఈ ఢిల్లీ బ్యూటీ.

ప్రస్తుతం బాగా జోష్ లో ఉన్న వెడ్డింగ్ ప్లానింగ్ బిజినెస్ ను సోదరితో కలిసి తాప్సీ మొదలుపెట్టింది. ఆ వ్యాపారం మొదలు పెట్టే సమయానికి అమ్మడికి అంతగా డిమాండ్ లేదు. అయితే.. తాప్సీ లాంటి సినిమా హీరోయిన్ నిర్వహిస్తున్న కంపెనీకి వెడ్డింగ్ కాంట్రాక్ట్ ఇస్తే.. ఆమెతో పాటు పలువురు సినిమా తారలు కూడా సందడి చేస్తారనే ఉద్దేశ్యంతో.. చాలామంది ఈ వ్యాపారం వైపు దృష్టి పెట్టారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.

తాప్సీ బిజీ హీరోయిన్ అయిపోయింది. పెళ్ళిళ్లకు డేట్స్ వెచ్చించే తీరిక ఈమెకు ఉండకపోవచ్చు. తాప్సీ రాదని తెలిస్తే.. వాళ్లు కాంట్రాక్టు ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మొత్తానికి తాప్సీ చేతి మీద ఇక పెళ్లిళ్లి జరగవేమో అనే డౌట్ వచ్చేయడం మాత్రం సహజమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News