సైరా కూడా 'బాహుబలి' మాదిరిగా..!

Update: 2019-02-03 12:56 GMT
'బాహుబలి' ఆరంభించినప్పటి నుండి రెండవ పార్ట్‌ విడుదలయ్యేప్పటికి దాదాపు అయిదు సంవత్సరాలు పట్టింది. ఒక సినిమా కోసం అంత సమయమా అంటూ అంతా కూడా అవాక్కయ్యారు. ఇప్పుడు సైరా కూడా అటు ఇటుగా అంత సమయంను తీసుకుంటుంది. చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' విడుదలయిన కొన్ని నెలలకు 'సైరా నరసింహారెడ్డి' చిత్రం ప్రారంభం అయ్యింది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మొదట గత ఏడాదిలోనే విడుదల చేయాలని భావించారు. కాని సినిమా చిత్రీకరణ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా దర్శకుడు సురేందర్‌ రెడ్డి మరియు రామ్‌ చరణ్‌ లు సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ కారణంగా సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది.

ఆమద్య ఒక ఇంటర్వ్యూలో రామ్‌ చరణ్‌ 'సైరా' చిత్రం విడుదలపై స్పందిస్తూ 2019 దసరా కానుకగా విడుదల చేస్తాం అంటూ ప్రకటించాడు. సినిమా చిత్రీకరణ సమ్మర్‌ తో పూర్తి చేస్తామని కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం షూటింగ్‌ ఆలస్యం అవుతుందని, రాజీ పడకుండా సురేందర్‌ రెడ్డి సినిమాను తెరకెక్కిస్తున్న కారణంగా సినిమా మరో సారి వాయిదా పడే అవకాశం ఉందనే టాక్‌ వినిపిస్తోంది.

ఖైదీ నెం.150 చిత్రం విడుదలైన మూడు సంవత్సరాలకు చిరంజీవి తదుపరి చిత్రం రాబోతుందన్నమాట. 2017 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ నెం.150 చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ కారణంగానే చిరంజీవి తదుపరి చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని సైరా మాత్రం బాహుబలి ఊరించినట్లుగా ఊరిస్తూ వాయిదాలు పడుతూ వస్తోంది. బాహుబలి సినిమాకు అయిదు ఏళ్లు పడితే సైరాకు మూడేళ్లు పట్లేలా ఉంది. 2020 అంటూ వస్తున్న వార్త మెగా ఫ్యాన్స్‌ ను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఎంత ఎదురు చూసినా మంచి సినిమా వస్తే ఫ్యాన్స్‌ ఆనందానికి అవదులు ఉండవు. అందుకే చిరంజీవి కూడా కష్టపడి సైరాను చేస్తున్నాడు.
    
    
    

Tags:    

Similar News