సాహో కలెక్షన్స్ దాటడం సైరాకు కష్టమే

Update: 2019-09-26 07:34 GMT
'సాహో' తర్వాత భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న చిత్రం 'సైరా'.  బడ్జెట్ విషయంలోనే కాకుండా ఇతర భాషలకు చెందిన వారు చాలామంది నటించడం.. పలు భాషల్లో ఒకేసారి ప్యాన్ ఇండియన్ ఫిలిం అంటూ రిలీజ్ చేస్తుండడంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇదే ఆసక్తి ఇతర భాషల విషయంలో ఉందా అంటే.. పెద్దగా ఆసక్తి లేదనే చెప్పాల్సి ఉంటుంది.

ముఖ్యంగా హిందీ వెర్షన్ తీసుకుంటే ప్రమోషన్స్ అల్మోస్ట్ జీరో అని చెప్పాలి.  తెలుగు సినిమాల ప్రమోషన్స్ కు హిందీ సినిమాల ప్రమోషన్స్ కు చాలా తేడా ఉంటుంది. ఎంత పెద్ద బాలీవుడ్ స్టార్ అయినా సరే.. తమ సినిమాలకు ఒక పది రోజుల పాటు భారీ ప్రమోషన్స్ చేస్తారు.  ఇంటర్వ్యూలు.. టీవీ రియాలిటీ షోలు.. బిగ్ బాస్ లు.. నచ్ బలియేలు.. కపిల్ శర్మ షో.. ఇలా ఒక్కటేమిటి అన్ని షోలకు హాజరై తమ సినిమాను ప్రచారం చేసుకుంటారు. 'సాహో' విషయంలో ప్రభాస్ ఏ స్థాయిలో ప్రమోషన్స్ లో పాల్గొన్నాడో అందరికీ తెలుసు.  ముంబైలోనే కొన్ని రోజులు మకాం వేసి అక్కడ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు.  ఇక అన్నీ రియాలిటీ షోలలో పాల్గొన్నాడు.  దీంతో సినిమాకు భారీగా బజ్ క్రియేట్ అయింది.  నిజానికి ప్రభాస్ కు 'బాహుబలి' స్టార్ అనే క్రేజ్ ఉన్నప్పటికీ తనే స్వయంగా రంగంలోకి దిగి భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయడం హిందీ వెర్షన్ కు ప్లస్ గా మారింది.   అయితే 'సైరా'  విషయంలో అలాంటి హడావుడి ఏదీ కనిపించడం లేదు.

ఇప్పటివరకూ 'సైరా' హిందీ వెర్షన్ ప్రమోషన్స్ సందడే లేదు. మెగాస్టార్ చిరంజీవి హిందీ ప్రేక్షకులకు తెలిసిన పేరే కానీ ప్రభాస్ లా క్రేజ్ అయితే లేదు.  అది మనం ఒప్పుకుని తీరాలి.   కాబట్టి హిందీ ప్రేక్షకులు ఈ సినిమా అద్భుతంగా ఉంది అనే టాక్ వస్తే తప్ప పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ప్రమోషన్స్ కూడా దాదాపు లేవు కాబట్టి ఓపెనింగ్స్ పై ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది.  ఈ లెక్కన చూస్తే 'సాహో' కలెక్షన్స్ ను అధిగమించడం 'సైరా' కు కష్టమే.


Tags:    

Similar News