• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  థమన్ కెరీర్ లో సూపర్...

థమన్ కెరీర్ లో సూపర్ బెస్ట్ వర్క్‌ 'సర్కారు వారి పాట'..!

By - Tupaki Desk
Update: 2022-01-06 10:39 GMT
'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ''సర్కారు వారి పాట''. 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ పెట్లా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - SVP బ్లాస్టర్ టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.

''సర్కారు వారి పాట'' సినిమాకు సంబంధించిన మ్యూజికల్ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఎలాంటి కొత్త అప్డేట్ లేకపోవడంతో కాస్త నిరాశ చెందుతున్న ఫ్యాన్స్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయమని సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందానికి రిక్వెస్ట్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ నుంచి సినిమా అప్డేట్స్ రాబోతున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురువారం ట్వీట్ చేస్తూ.. ''మేము మీ మాటలు విన్నాం.. మేము వింటున్నాం.. అతి త్వరలో మీరు మా నుండి వింటారు. పరశురామ్ మన సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు గారికి సూపర్ బెస్ట్ ఇస్తున్నారు. దీని కోసం మా టీమ్ మొత్తం చాలా కష్టపడుతోంది'' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరశురామ్ తో కలిసి ఉన్న ఓ ఫోటోని థమన్ అభిమానులతో పంచుకున్నారు.

దీనికి పరశురాం స్పందిస్తూ.. ''రాబోయే రోజుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'సర్కారు వారి పాట' మ్యూజిక్ మీ సూపర్ బెస్ట్ వర్క్‌ లలో ఒకటిగా గుర్తించబడుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను థమన్'' అని పేరొన్నారు. డైరెక్టర్ - మ్యూజిక్ డైరెక్టర్ చేసిన ఈ ట్వీట్స్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తున్నాయి. మరి సంక్రాంతికి వచ్చే మొదటి పాట ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

కాగా, 'సర్కారు వారి పాట' చిత్రాన్ని సందేశాత్మక అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా రెడీ చేస్తున్నారు. ఇందులో మహేష్ బాబు సరికొత్తగా కనిపించబోతున్నారనే ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలను బట్టి అర్థం అవుతోంది. ఈ చిత్రంలో సముద్ర ఖని - ప్రకాష్ రాజ్ - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ - 14 రీల్స్ ప్లస్ - జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని - వై.రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని 2022 ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Tags:    
  • Sarkaru Vaari Paata 
  • Mahesh Babu 
  • Parasuram 
  • Keerthy Suresh 
  • Prakash Raj 
  • vennala Kishore 
  • Subbaraju 
  • Thaman 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS