సుశాంత్‌ పై మాజీ విశ్వసుందరి కామెంట్స్‌

Update: 2020-07-07 11:50 GMT
సుశాంత్‌ మరణం ఆయన అభిమానులతో పాటు బాలీవుడ్‌ సినీ ప్రముఖుల హృదయాలను ద్రవింపజేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడం ప్రతి ఒక్కరికి ఆవేదన కలిగిస్తుంది. సుశాంత్‌ మృతి చెంది ఇన్ని రోజులు అయినా కూడా ఇంకా ఆయన జ్ఞాపకాల్లో అభిమానులు ఉన్నారు. తాజాగా ఆయన నటించిన చివరి చిత్రం దిల్‌ బేచారా విడుదలకు సిద్దం అయ్యింది. ఓటీటీ ద్వారా విడుదల కాబోతున్న ఆ సినిమా ట్రైలర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ట్రైలర్‌ లో సుశాంత్‌ చెప్పిన డైలాగ్స్‌ అభిమానులతో పాటు సినీ వర్గాల వారిని కూడా కట్టి పడేశాయి. చాలా మంది ఎమోషనల్‌ అయ్యి సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. సుశాంత్‌ ఆత్మహత్య ఇంకా దిల్‌ బేచారా మాజీ విశ్వసుందరి సుష్మిత సేన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. సుశాంత్‌ తో నేను వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడినది లేదు. కాని అతడి ఇంటర్వ్యూలు మరియు సినిమాలు చూడటం వల్ల అతడి గురించి పరిచయం ఉంది. అతడి అభిమానులు ఆయన గురించి నాకు చాలా ఎక్కువే తెలిసేలా చేశారు.

అతడి సింప్లిసిటీ.. ప్రేమించే గుణం.. స్మైల్‌ తో ఎంతో మందిని అభిమానులగా చేసుకున్నాడు. సుశాంత్‌ నటుడిగానే కాకుండా ఒక మానవతా వాది. అతడితో నాకు పని చేసే అవకాశం వచ్చి ఉంటే బాగుండేది. అతడితో సమయం గడిపే అవకాశం వచ్చి ఉంటే ఎన్నో విషయాలను తెలుసుకునేదాన్ని. దిల్‌ బేచరా ట్రైలర్‌ అద్బుతంగా ఉంది. సుశాంత్‌ నటన మరియు బాడీ లాంగ్వేజ్‌ చాలా బాగుంది అంటూ ప్రశంసలు కురిపించింది.
Tags:    

Similar News