శ్రుతిపై క‌న్నేసిన సుశాంత్‌?

Update: 2015-11-29 07:30 GMT
అందాల శ్రుతిహాస‌న్  టాలీవుడ్‌ - కోలీవుడ్‌ - బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ప‌రిశ్ర‌మ‌లో ఆటాడేసుకుంటోంది. ఇక్క‌డో సినిమా - అక్క‌డో సినిమా - వేరే ఎక్క‌డో ఇంకో సినిమా చేస్తూ .. క్ష‌ణం తీరిక లేకుండా ప్ర‌యాణం చేస్తోంది. నిత్యం విమానాల్లోనే నిదుర‌పోతున్నా ! అంటూ అప్పుడు ఓ పెద్ద స్టేట్‌ మెంట్ కూడా ఇచ్చింది. కేవ‌లం గాల్లోనే నిదుర‌పోయే అదృష్టం ఎంద‌రికి ఉంటుంది?  గాల్లో నిదుర‌పోతూ, సెట్స్‌ లో సేద తీరుతూ వృత్తిని న‌డిపించే అరుదైన అవ‌కాశం ఈ అమ్మ‌డికి ద‌క్కింది. అయితే శ్రుతి ..కి ఈ రేంజు వ‌చ్చింది మామూలుగా కాదు. అటు కామ‌న్ ఆడియెన్‌ తో పాటు ఇటు సెల‌బ్రిటీల్లోనూ విప‌రీత‌మైన ఫ్యాన్స్ ఉండ‌బ‌ట్టే.

ఇప్ప‌టికిప్పుడు ఈ అమ్మ‌డికి ముగ్గురు హీరోలు వీరాభిమానులుగా ఉన్నారు.  అక్కినేని నాగార్జున - అక్కినేని నాగ‌చైత‌న్య‌... ఇప్పుడు ఇదే వ‌రుస‌లో అదే కాంపౌండ్ నుంచి హీరోగా చెలామ‌ణి అవుతున్న సుశాంత్ కూడా అభిమాని అన్న సంగ‌తి రివీలైంది. కింగ్ న‌టిస్తున్న ఊపిరి చిత్రంలో శ్రుతిహాస‌న్ ఓ అతిధిగా త‌ళుక్కుమ‌న‌బోతోంది. అలాగే ప్ర‌స్తుతం చైత‌న్య స‌ర‌స‌న ప్రేమమ్ రీమేక్‌ లో ఛాన్సందుకుందంటే అది చైతూ విప‌రీతంగా అభిమానించ‌డం వ‌ల్ల‌నే. అలాగే ఇప్పుడు సుశాంత్ కూడా శ్రుతిహాస‌న్ అంటే త‌న‌కి ఎంతో అభిమాన‌మ‌ని చెప్పాడు. అభిమాన నాయిక‌ల జాబితా చెప్పాలంటే చాలా పెద్ద‌ది అంటూనే, శ్రుతిహాస‌న్ పేరు చెప్పాడు ఈ కుర్ర‌హీరో. అదీ మ్యాట‌రు. ఒక‌వేళ భ‌విష్య‌త్‌ లో త‌న‌తో క‌లిసి న‌టించాల‌నుకుంటున్నాడా?  ప్ర‌స్తుతానికి ఆటాడుకుందాం.. రా సినిమాతో బిజీ. నెక్స్ట్ త‌న సినిమా లో శ్రుతి న‌టించాల‌ని కోరుకుంటున్నాడో ఏమో?
Tags:    

Similar News