జక్కన్నా.. సూర్యా గోడు వినన్నా

Update: 2015-05-24 07:30 GMT
''దయచేసి మీరైనా చెప్పండి.. రాజమౌళి సినిమాలో నాకో అవకాశం ఇవ్వమని'' అంటూ మీడియా వాళ్లకు విజ్ఞప్తి చేశాడు సౌత్‌ ఇండియాలోనే పెద్ద స్టార్లలో ఒకడైన సూర్య. బాహుబలి సినిమాలో ఓ పాత్ర కోసం మిమ్మల్ని రాజమౌళి అడిగారటగా అని సూర్యను ప్రశ్నిస్తే.. ''అలాంటిదేమీ లేదు. రాజమౌళి ఛాన్స్‌ ఇస్తే వద్దంటానా? నాకు రాజమౌళి దర్శకత్వంలో చేయాలని ఎంతో కోరికగా ఉంది. మీరైనా చెప్పండి. రాజమౌళి సినిమాలో నటించే అవకాశం ఇవ్వమని'' అని వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు సూర్య.

బాహుబలి కోసం దేశవ్యాప్తంగా ఆడియన్స్‌ ఎదురు చూస్తున్నారన్న సూర్య.. ఈ సినిమా తమిళ వెర్షన్‌కు తమ ఇండస్ట్రీ తరఫున చేయాల్సిందంతా చేస్తామన్నాడు. ప్రభాస్‌ లాంటి స్టార్‌ హీరో ఓ సినిమా కోసం రెండు మూడేళ్లు వెచ్చించడం అంటే మామూలు విషయం కాదని.. దీన్ని బట్టే బాహుబలి ఎంత గొప్ప సినిమానో అర్థం చేసుకోవచ్చని సూర్య అన్నాడు. తెలుగులో ఓ సినిమా చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నామని.. ఓ దర్శకుడితో సినిమా ఓకే అయ్యాక క్యాన్సిల్‌ అయిందని.. త్వరలోనే తప్పకుండా తెలుగు సినిమా చేస్తానని సూర్య చెప్పాడు. తన కొత్త సినిమా 'రాక్షసుడు' కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని సూర్య ధీమా వ్యక్తం చేశాడు. ఈ మూవీ మే 29న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.





Tags:    

Similar News