అజ్ఞాతవాసి కూడా చూడండి -సూర్య

Update: 2018-01-06 05:29 GMT
టాలీవుడ్ లో తమిళ హీరోల సినిమాలు ఏ రేంజ్ లో రిలీజ్ అవుతాయో అందరికి తెలిసిందే. ఇక్కడ ఎంత పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నా సరే కొంత మంది కోలీవుడ్ స్టార్స్ ఏ మాత్రం భయపడకుండా అదే సమయంలో పోటీ పడటానికి సిద్దమవుతుంటారు. అదే తరహాలో సూర్యా కూడా ఈ సంక్రాంతికి తన గ్యాంగ్ సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై కన్నేశాడు. టాలీవుడ్ లో సూర్యా డబ్బింగ్ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది.

కోలీవుడ్ హీరోల్లో ఇక్కడ రజినీకాంత్ తరువాత సూర్యా సినిమాలకు ఎక్కువ బిజినెస్ జరుగుతుంటుంది. ఇకపోతే శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని సూర్యా గ్రాండ్ గా చేశాడు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. అయితే ప్రీ రిలీజ్ వేడుకలో సూర్యా తన మాటలతో చాలా ఆకట్టుకున్నాడు. ముందుగా ఎప్పటి నుంచో తన సినిమాలను ఆదరిస్తున్న తెలుగు అభిమానులకు చాలా కృతజ్ఞతలని తెలుపుతూ ఈ సినిమా కూడా తప్పకుండా నచ్చుతుందిని చెప్పాడు. ఇక తెలుగు ఇండస్ట్రీ కి రావడానికి తనకు ఇంత సపోర్ట్ గా నిలిచినా అల్లు అరవింద్ గారికి చాలా థాంక్స్ అని సినిమాలో మొదటి సారి తను డబ్బింగ్ చెప్పాను  అని తెలుగులో ఒక డైలాగ్ కూడా చెప్పాడు.

గుండెల్లో దైర్యం చేతిలో ధర్మం ఉంటే దేనికి బయపడక్కర్లేదు అని సూర్యా చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంది. ఇక చిత్రానికి పని చేసిన గ్యాంగ్ మొత్తాన్ని పొగుడుతూ ఈ సంక్రాంతికి మీ ముందుకు రాబోతున్న సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా అని అలాగే పవర్ స్టార్ సినిమా అజ్ఞాతవాసి కూడా రాబోతోంది. ఆ సినిమా కూడా చుడండి అని సూర్యా పవన్ అభిమానులను ఆకర్షించాడు. ఫైనల్ గా మీ ప్రేమ నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది అంటూ మీ ఆశీస్సులు ప్రేమ ఇంకా కావాలి అంటూ ఫైనల్ గా ప్రసంగాన్ని ముగించాడు.   



Tags:    

Similar News