ప్రమోషన్స్ మొదలెట్టేశారుగా!!

Update: 2017-01-22 06:27 GMT
సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సింగం.. పలు మార్లు వాయిదా వేసుకుని.. ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయిపోయింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతోన్న ఈ మూవీకి.. ప్రస్తుతం ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసేసింది యూనిట్.

తమిళ్ వెర్షన్ కు ప్రమోషన్స్ చేసేలా ప్రస్తుతం తమిళనాడులో పరిస్థితులు. అందుకే అక్కడ నామమాత్రపు ప్రమోషన్స్ చేస్తున్న యూనిట్.. తెలుగులో మాత్రం ఓ రేంజ్ లో ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే తెలుగు వెర్షన్ కి సంబంధించి పేపర్ యాడ్స్ కూడా ఇచ్చేస్తున్నారు. వారం ముందు నుంచే హంగామా మొదలుపెట్టేశారు. సూర్య.. శృతి హాసన్ లు నటించిన పాటకు సంబంధించిన ఓ స్టిల్ సూపర్బ్ గా ఆకట్టుకుంటోంది.

తమిళ్ లో సింగం మూడోభాగంగా వస్తున్న ఈ చిత్రం పేరును ఎస్3 నుంచి సీ3 గా మార్చినా.. తెలుగులో మాత్రం ఎస్3 అంటూనే రిలీజ్ చేయబోతున్నారు. యముడు-3 అనే ట్యాగ్ లైన్ వస్తున్న ఈ మూవీలో అనుష్క లీడ్ హీరోయిన్ కాగా.. శృతి హాసన్ సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. హారిస్ జైరాజ్ అందించిన మ్యూజిక్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News