గ్లామర్ డోస్ పెంచేసిన ఖుషీ కపూర్!
సందర్భం ఏదైనా సరే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు సెలబ్రిటీలు.;
సందర్భం ఏదైనా సరే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు సెలబ్రిటీలు. ముఖ్యంగా సినిమాల ద్వారా దక్కించుకోలేని పాపులారిటీని ఇలా నిత్యం ఫోటోషూట్ తో దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ఇక నిన్న క్రిస్మస్ కావడంతో చాలామంది సెలబ్రిటీలు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో అందంగా ముస్తాబవడమే కాకుండా తన గ్లామర్ డోస్ తో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరో కాదు దివంగత నటీమణి శ్రీదేవి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ రెండవ కుమార్తె ఖుషీ కపూర్.
క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా తాజాగా తన స్నేహితులతో సందడి చేసిన ఈమె.. తన అందంతో గ్లామర్ డోస్ పెంచేసి ఫాలోవర్స్ ను ఆకట్టుకుంది. వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ లో డ్రెస్ ధరించి.. అందాలతో అదరహో అనిపించింది. ఏది ఏమైనా క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఖుషీ కపూర్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఖుషీ కపూర్ విషయానికి వస్తే.. 2000 నవంబర్ 5న జన్మించిన ఈమె సురేందర్ కపూర్ మనవరాలు కూడా.. సినీ నటులు అనిల్ కపూర్, సంజయ్ కపూర్ లకు మేనకోడలు.. ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈమె సోదరి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈమెకు ఇద్దరు సవతి తోబుట్టువులు కూడా ఉన్నారు. వారే అర్జున్, అన్షుల. ఈమె తన స్కూల్ విద్యాభ్యాసాన్ని ముంబైలోని ఎకోల్ మొండియేల్ వరల్డ్ స్కూల్లో పూర్తి చేసి.. 2019లో న్యూయార్క్ ఫిలిం అకాడమీలో నటన కోర్సును ఒక ఏడాది పాటు పూర్తి చేసింది.
ది ఆర్చీస్ అనే హిందీ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. ఇందులో బెట్టీ కూపర్ పాత్ర పోషించింది. 2023 డిసెంబర్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. తర్వాత 2022లో వచ్చిన లవ్ టుడే అనే తమిళ సినిమా రీమేక్ లవ్ యాపాలో కూడా నటించింది. సినిమాలలోనే కాకుండా పలు యాడ్స్ లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది ఖుషీ కపూర్. ప్రస్తుతం ఈమె తన తల్లి దివంగత నటీమణి శ్రీదేవి గతంలో నటించిన మామ్ సినిమా సీక్వెల్ మామ్ 2 లో నటిస్తోంది. ఇందులో కీర్తి అనే పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.
ఇకపోతే ఈమె టెలివిజన్ సిరీస్ లో కూడా నటించింది. ఫ్యాబులస్ లివ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ అనే టెలివిజన్ సిరీస్ లో కూడా ఇచ్చి ప్రేక్షకులను మెప్పించింది. బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తన సోదరిలాగే టాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని శ్రీదేవి అభిమానులు కోరుకుంటున్నారు.