ఫ్యామిలీతో మహేష్ బాబు క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!

సినిమాల నుండీ కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ.. ఎంజాయ్ చేస్తున్న అతి కొద్దిమంది హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానంలో ఉంటారు.;

Update: 2025-12-26 08:42 GMT

సినిమాల నుండీ కాస్త సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ.. ఎంజాయ్ చేస్తున్న అతి కొద్దిమంది హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానంలో ఉంటారు. అందుకే ఆయన ఏ సినిమాలో నటించినా సరే సమయం కల్పించుకొని మరీ వెకేషన్ కి వెళ్తూ..ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని.. తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఈ వేడుకలను తన కుటుంబ సభ్యులతో జరుపుకోవడమే కాకుండా.. తన చుట్టుపక్కల వారితో కూడా ఈ ఆనందాన్ని షేర్ చేసుకున్నారు.

క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను తాజాగా షేర్ చేసుకోగా.. అందులో మహేష్ బాబు, ఆయన సతీమణి, ప్రముఖ హీరోయిన్ నమ్రత శిరోద్కర్, వారి కూతురు సితార ఘట్టమనేని, కొడుకు గౌతమ్ ఘట్టమనేనితోపాటు పలువురు బంధుమిత్రులు కూడా ఆ ఫోటోలలో కనిపించారు. అలా మొత్తానికైతే ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో మహేష్ బాబు లుక్ చూసి అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన రాజమౌళి దర్శకత్వంలో తొలిసారి పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు కం డైరెక్టర్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే కీలక పాత్ర పోషిస్తున్నారు.. 2027 సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గ్లోబ్ ట్రోటర్ అంటూ రామోజీ ఫిలిం సిటీ వేదికగా ఒక భారీ ఈవెంట్ను నిర్వహించారు రాజమౌళి.

అంతకుముందు ఇందులో మహేష్ బాబు లుక్ తో పాటు ప్రియాంక మందాకిని పాత్రలో నటిస్తున్నట్లు ఆమె ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు అలాగే పృథ్విరాజ్ సుకుమారన్ పాత్రను కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పంచుకున్న విషయం తెలిసిందే.

దీనికి తోడు ఈ సినిమాల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఇలా భారీ తారాగణంతో రాబోతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు సమాచారం. దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏకంగా 1200 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి మరో రెండు సంవత్సరాల పాటు మహేష్ బాబు మూవీలు విడుదలయ్యే అవకాశాలు లేవు కాబట్టే ఆయన కెరియర్లో మంచి సక్సెస్ అందుకున్న సినిమాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులు సరిపెట్టుకుంటున్నారు.

Tags:    

Similar News