• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూర్య తెలుగోళ్లకు అంత...

సూర్య తెలుగోళ్లకు అంత ప్రయారిటీ ఇస్తాడా?

By - Tupaki Desk
Update: 2016-03-16 11:30 GMT
సూర్య సినిమా వస్తోందంటే తెలుగు నిర్మాతలు కూడా తమ సినిమాల్ని వాయిదా వేసుకుంటారంటూ నాగార్జున చేసిన వ్యాఖ్యల్లో అతిశయోక్తి ఏమీ లేదు. ఈ మధ్య సరైన సినిమాలు పడకపోవడం వల్ల కొంచెం జోరు తగ్గింది కానీ... మామూలుగా అయితే సూర్యకు తెలుగు హీరోలతో సమానంగా ఫాలోయింగ్ ఉందిక్కడ. ఆ సంగతి గ్రహించే తెలుగు అభిమానులకు చాలా ప్రయారిటీ ఇస్తుంటాడు సూర్య. తన సినిమాల తెలుగు డబ్బింగ్ విషయంలో జాగ్రత్త పాటిస్తాడు. తెలుగు కోసం కొన్ని సన్నివేశాలు ప్రత్యేకంగా చేస్తాడు. ప్రమోషన్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టిపెడతాడు. ఈ మధ్య తన సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచడంతో కొంత వెనకబడ్డ సూర్య.. ‘24’ మూవీతో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నాడు.

తెలుగులో ఇష్క్ - మనం లాంటి సినిమాలు తీసిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడం.. పైగా సమంత హీరోయిన్ కావడంతో ‘24’పై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. వేసవికి రాబోయే భారీ తెలుగు సినిమాలతో సమానంగా దీని కోసం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మన ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో ‘24’ ఆడియోను ముందు తెలుగులోనే రిలీజ్ చేయాలని చూస్తున్నాడట సూర్య. ఈ నెల 28న హైదరాబాద్‌ లోని శిల్ప కళావేదికలో ‘24’ ఆడియో వేడుక నిర్వహించబోతున్నారట. దర్శకుడు విక్రమ్, హీరోయిన్ సమంతలతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్.. తెలుగులో ‘24’ను విడుదల చేయబోతున్న నితిన్ కూడా ఈ వేడుకలో పాల్గొంటారట. సూర్య నిజంగా తమిళం కంటే ముందు తెలుగు ఆడియో వేడుక చేస్తే.. అతడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
Tags:    
  • Suriya 24 movie 
  • Suriya 
  • Telugu nEws 

Similar News

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

Copyright @2026

Powered by Blink CMS