ఆ దర్శకుడికి ఓటేసిన సురేష్ బాబు

Update: 2019-11-10 05:51 GMT
వెట్రి మారన్ దర్శకత్వం లో ధనుష్ హీరో గా తెరకెక్కిన తమిళ చిత్రం 'అసురన్' బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ముఖ్యం గా ధనుష్ డబల్ రోల్ అందరినీ ఆకట్టుకుంది.  ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ సీనియర్ నిర్మాత సురేష్ బాబు చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగు రీమేక్ విషయన్ని అధికారికంగా ప్రకటించారు.


ఈ సినిమా ను వెంకటేష్ హీరోగా నిర్మించాలని సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే దాని పై గత కొన్ని రోజులు గా చర్చలు సాగుతున్నాయి. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో ఉండే సినిమా కాకపోవడంతో ఎక్కువమంది దర్శకులు ఈ సినిమాను టేకప్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదని కూడా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ రీమేక్ కు దర్శకత్వం వహించేందు కు హను రాఘవపూడి ముందుకు వచ్చారని.. సురేష్ బాబు కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.  హను మేకింగ్ విషయంలో తన టాలెంట్ ఎప్పుడో నిరూపించుకున్నారు కానీ వరస పరాజయాలు ఇబ్బంది పెడుతున్నాయి. హను దర్శకత్వం లో తెరకెక్కిన 'లై'.. 'పడి పడి లేచే మనసు' సినిమా లు తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అయితే 'అసరన్' మంచి స్క్రిప్ట్ కాబట్టి హనుకు విజయం సాధించేందుకు మంచి అవకాశం దక్కినట్టే.


హను ఇప్పటి కే ఈ రీమేక్ పనులు మొదలు పెట్టారని సమాచారం.  తెలుగు వెర్షన్ డైలాగ్స్.. స్క్రిప్ట్ వర్క్ పై పని చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు వెల్లడవుతాయి.  ఈ సినిమాను సురేష్ బాబు.. కలైపులి ఎస్. థాను సంయుక్తం గా నిర్మిస్తారు.
Tags:    

Similar News