రానా ప్రేమ వ్యవహారంపై స్పందించిన సురేష్ బాబు
టాలీవుడ్ యంగ్ హీరో రానా తన బ్యాచిర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. తన ప్రేమకు మిహిక ఓకే చెప్పింది అంటూ రానా సోషల్ మీడియా ద్వారా తెలియజేసి ఒక్కసారిగా టాలీవుడ్ ప్రముఖులు షాక్ అయ్యేలా చేశాడు. రానా మిహిక వివాహం ఈ ఏడాదిలోనే ఉంటుందని కుటుంబ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చేశారు. హైదరాబాదీ మ్యారేజ్ ప్లానర్ అయిన మిహిక బజాజ్ తో రానా చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మాటలు వింటే అర్థం అవుతుంది.
తాజాగా రానా తండ్రి.. ప్రముఖ నిర్మాత అయిన సురేష్ బాబు ఈ విషయం లో స్పందించారు. రానా మిహిక చాలా కాలంగా మంచి స్నేహితులు. వారిద్దరు ఇలా ప్రేమించుకుంటున్నట్లుగా తెలిసి ఆశ్చర్యపోయాము. లాక్ డౌన్ తో ఏ పని లేకుండా ఉన్న మాకు వారిద్దరు మంచి పనిని మా ముందుకు తీసుకు వచ్చారు. ఈ సమయంను మేము వారి పెళ్లి పనులతో గడపాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటి నుండే పెళ్లి పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నాం. లాక్ డౌన్ ముగిసిన తర్వాత డిసెంబర్ కు ముందే పెళ్లి ఉంటుందని సురేష్ బాబు అన్నారు.
సురేష్ బాబు ఈ పెళ్లి విషయంపై చాలా సానుకూలంగా స్పందించడంతో పాటు పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పడంతో ముందే రానా ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఇక రానా ప్రేమ విషయమై క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిహికతో అతడిది కేవలం స్నేహం అనుకున్నాం. కాని అతడు ఇంతగా ఆమెను ప్రేమిస్తున్నాడనే విషయంను తెలుసుకోలేక పోయాం అంటున్నారు. టాలీవుడ్ యంగ్ స్టార్స్ పలువురు రానాకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.