'అన్నాత్తే' కథ ఇంకా ముగియలేదా?

Update: 2021-08-21 02:19 GMT
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన అన్నాత్తే సినిమా షూటింగ్ సెకండ్‌ వేవ్‌ సమయంలో హైదరాబాద్‌ లో నిర్వహించారు. ఆ సమయంలోనే షూటింగ్ ముగిసినట్లుగా వార్తలు వచ్చాయి. అన్నాత్తే సినిమా షూటింగ్ ను ముగించుకుని రజినీకాంత్‌ అమెరికా వెళ్లాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అన్నాత్తే సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వలేదు. మరో కీలకమైన షెడ్యూల్‌ అలాగే బ్యాలన్స్ ఉందట. ఆ కీలక షెడ్యూల్‌ ను కోల్‌ కత్తాలో తెరకెక్కించబోతున్నారట.

కోల్‌కత్తాలో రెండు వారాల పాటు అన్నాత్తే సినిమా షూటింగ్‌ ను నిర్వహించి.. ఆ తర్వాత గుమ్మడి కాయ కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. రజినీకాంత్‌ తో పాటు కీలక నటీనటులు ఆ షెడ్యూల్‌ లో పాల్గొంటారు. హీరోయిన్స్‌ మాత్రం ఈ షెడ్యూల్‌ లో పాల్గొనే విషయం పై స్పష్టత లేదు. ప్రస్తుతానికి రజినీకాంత్‌ మరియు ఇతర నటీనటులతో మాత్రమే ఈ షెడ్యూల్‌ కొనసాగుతుందని తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ కోసం కోల్‌ కత్తాలో ఏర్పాట్లు జరుగుతున్నాయని.. రజినీకాంత్ రేపటి నుండి షూటింగ్‌ లో జాయిన్ అవుతాడని తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అన్నాత్తే సినిమా ను దీపావళి కి విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. కనుక ఈ నెలలో షూటింగ్‌ ను పూర్తి చేసి వచ్చే నెలలో సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ ను నిర్వహించబోతున్నారు. రజినీకాంత్ మరియు శివల కాంబోలో రాబోతున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తుంది అనే నమ్మకంతో రజినీకాంత్‌ అభిమానులు ఉన్నారు. అతి త్వరలోనే ఈ సినిమా టీజర్ ను తీసుకు వచ్చేలా కూడా ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ ముగించిన తర్వాత ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టబోతున్నారు. రజినీకాంత్ కొత్త సినిమా షూటింగ్‌ ను వచ్చే నెలలో మొదలు పెట్టేలా ప్లాన్‌ చేస్తున్నారు.




Tags:    

Similar News