బాలయ్య ఈసారి పూర్తిగా విన్నారా?
ఆ విషయాన్ని బాలయ్య ఎంతో స్పోర్టివ్ గా తీసుకున్నారు. వాస్తవాన్ని గుర్తించారు. దీంతో దర్శకుడు గోపీచంద్ మలినేని అప్పటికప్పుడు కథ మార్చారు.;
నటసింహ బాలకృష్ణను స్టోరీ తో మెప్పించడం ఏ డైరెక్టర్ అయినా చాలా ఈజీ. ఎందుకంటే ఆయన కేవలం లైన్ మాత్రమే వింటాడు. పూర్తి కథ వినరు. విన్నా కొద్దిగా విని బాగుందని ఒకే చేసేస్తారు. పూర్తి కథ చెబుతామమన్నా అవసరం లేదు చెప్పావ్ కదా? అంటారు. అలా బాలయ్యను స్టోరీ పరంగా బుట్టలో వేయడం ఏ డైరెక్టర్ అయినా ఈజీ. పాయింట్ నచ్చిందంటే? డైరెక్టర్ ని నమ్మి ముందుకెళ్లిపోతారు. కథల్లో కూడా ఆయన వేలు పెట్టరు. డైరెక్టర్లకు పూర్తిగా స్వేచ్ఛనచ్చి పనిచేసుకోనిస్తారు. ఈ విషయంలో బాలయ్య నిజంగా గ్రేట్.
స్టార్ హీరోలతో సినిమాలంటే డైరెక్టర్లకు క్రియేటివ్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీంతో ఆ సినిమాలు ఆరంభంలో ఆగిపో వడమో లేక? మధ్యలో నిలిచిపోవడమే జరుగుతోంది. బాలయ్య తో అలాంటి ఇబ్బందులేవి ఉండవు. బాలయ్య నమ్మాడంటే బ్లైండ్ గా ముందకెళ్లిపోతారు. బాలయ్య 111వ సినిమా గోపీచంద్ మలినేనితో లాక్ అయిన సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించానుకున్నారు. కానీ ఆ కథకు భారీగా బడ్జెట్ అవుతుంది. బాలయ్య మార్కెట్ చూస్తే అంత లేదు. దీంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. బాలయ్య కెరీర్ లో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
ఆ విషయాన్ని బాలయ్య ఎంతో స్పోర్టివ్ గా తీసుకున్నారు. వాస్తవాన్ని గుర్తించారు. దీంతో దర్శకుడు గోపీచంద్ మలినేని అప్పటికప్పుడు కథ మార్చారు. నిర్మాత ఇచ్చిన బడ్జెట్ లోపు కథను సిద్దం చేసి బాలయ్య ముందుకు వెళ్లారు. అయితే ఈసారి బాలయ్య లైన్ వినో?..గంట స్టోరీ వినో? వదిలేయలేదుట. పూర్తి కథను విన్నారుట. అదీ పిన్ టూ పిన్. దాదాపు మూడు గంటల పాటు గోపీచంద్ నేరేట్ చేసాడని సమాచారం. కథ అంతా పూర్తిగా విన్న తర్వాత నచ్చడంతోనే బాలయ్య లాక్ చేసారని ఫిలిం సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. దీంతో బాలయ్య ఏ కారణంగా కథ విన్నాడంటూ చర్చించుకుంటున్నారు.
స్టోరీపై డౌట్ వచ్చా? డైరెక్టర్ పై సందేహం వచ్చా? అనే ప్రశ్న రెయిజ్ అవుతుంది. ఆ సంగతి పక్కన బెడితే ఇద్దరిదీ సక్సెస్ పుల్ కాంబినేషన్. ఇద్దరి కలయికలో తెరకెక్కిన `వీరసింహారెడ్డి` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. కమర్శియల్ గా ఆ సినిమా బాగా రాణించింది. ఆ నమ్మకంతోనే బాలయ్య మరోసారి అవకాశం ఇచ్చారు. బాలయ్య గత సినిమా `అఖండ తాండవం` భారీ అంచనాల మధ్య విడుదలై సక్సస్ అయిన సంగతి తెలిసిందే. బాలయ్య నుంచి రిలీజ్ అయిన తొలి పాన్ ఇండియా సినిమా ఇదే. మరి గోపీచంద్ చిత్రాన్ని కూడా పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తారా? అన్నది చూడాలి.