కొత్త వారికి సూపర్‌ స్టార్‌ బంపర్‌ ఆఫర్‌

Update: 2020-06-04 07:30 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వచ్చే ఏడాది కనీసం మూడు లేదా నాలుగు సినిమాలను అయినా తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో చర్చలు జరుపుతున్నాడట. మహేష్‌ బాబు ఒకే ఏడాది మూడు నాలుగు సినిమాలా అంటూ ఆశ్చర్య పోతున్నారా.. హీరోగా కాదులేండి నిర్మాతగా. ఇప్పటికే మహేష్‌ బాబు నిర్మాణ సంస్థ ప్రారంభించి తన సినిమాలకు కో ప్రొడ్యూసర్‌ గా వ్యవహరిస్తున్నాడు. అడవి శేషు ప్రధాన పాత్రలో ‘మేజర్‌’ అనే చిత్రంను నిర్మిస్తున్నాడు.

హీరోగా మహేష్‌ బాబు బిజీగా ఉన్నా ఆయన భార్య నమ్రత నిర్మాణ వ్యవహారాలు చూసుకోబోతున్నారు. ఆమెకు ఫిల్మ్‌ మేకింగ్‌ అంటే చాలా ఆసక్తి. గతంలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు. ఆ ఆసక్తితోనే వరుసగా సినిమాలను నిర్మించేందుకు కథలు వింటున్నారు. వచ్చే ఏడాదిలో పలు మీడియం బడ్జెట్‌ చిన్న బడ్జెట్‌ సినిమాలను కొత్త వారితో తీయడంతో పాటు వెబ్‌ సిరీస్‌ లను కూడా చేసే ఉద్దేశ్యంలో ఉన్నారట.

మహేష్‌ బాబు బ్రాండ్‌ ఇమేజ్‌ తో సినిమాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. కనుక పెద్దగా బడ్జెట్‌ పెట్టకుండా బ్రాండ్‌ వ్యాల్యూతోనే సినిమాలను నిర్మించి వచ్చిన లాభాల్లో వాటా తీసుకోవాలని నమ్రత ప్లాన్‌ గా తెలుస్తోంది. మొత్తానికి మహేష్‌ బాబు ప్రొడక్షన్‌ నుండి మాత్రం వరుసగా సినిమాలు రావడం కన్ఫర్మ్‌ అయ్యింది. వాటిల్లో ఎక్కువ శాతం కొత్త రచయితలకు మరియు దర్శకులకు ఛాన్స్‌ ఇవ్వాలని కూడా భావిస్తున్నారట. మహేష్‌ ఇవ్వబోతున్న ఈ బంపర్‌ ఆఫర్‌ ను ఎంత మంది అంది పుచ్చుకోనున్నారో..!
Tags:    

Similar News