దీపికా పదుకునే వైఖరి వల్ల చేజారుతున్న అవకాశాలా..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే ఎక్కువగా వివాదాల వల్ల వార్తల్లో నిలుస్తోంది.;
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే ఎక్కువగా వివాదాల వల్ల వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ అమ్మడు రెండు మూడు సినిమాల నుంచి తప్పించబడ్డ విషయం తెల్సిందే. వర్కింగ్ అవర్స్ విషయంలో ఈమె కొత్త ఉద్యమం లేవనెత్తింది. అందరిది ఒక దారి అయితే నాది ఒక దారి అన్నట్లుగా ఈమె వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈమె ప్రవర్తన వల్ల పొగరుబోతు అనే పేరు వచ్చింది. బాలీవుడ్‌లోనూ ఈమె తీరును విమర్శించే వారు చాలా మంది ఉన్నారు. సినిమాల షూటింగ్ నుంచి మొదలుకుని ప్రతి విషయంలోనూ ఈమె వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. ప్రమోషన్ విషయంలో ఈమె సహకరించదు అంటూ గతంలో ఒకరు ఇద్దరు నిర్మాతలు ఆఫ్ ది మీడియా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు షూటింగ్ టైమింగ్ విషయంలో ఈమె పెడుతున్న కండీషన్ తీవ్రమైన చర్చకు తెర తీయడం జరిగింది.
ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమాలో...
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమాలో మొదట దీపికా పదుకునేను ఎంపిక చేయడం జరిగింది. ఆమె హీరోయిన్‌గా నటిస్తే స్పిరిట్ సినిమా స్థాయి మరింత పెరుగుతుందని అంతా భావించారు. కానీ ఆ స్థానంలో మరో హీరోయిన్ ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రకటించాడు. అంతే కాకుండా ఆ సమయంలో పేరు ఎత్తకుండా దీపికా పదుకునే పై సందీప్ రెడ్డి వంగ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రభాస్ కల్కి 2 సినిమా నుంచి కూడా ఆమెను తప్పించారు. ఒకటి కాదు రెండు కాదు చాలా సినిమాలు ఆమె చేతులు జారినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్‌ను ఆమె చేజార్చుకుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'ది వైట్ లోటస్' వెబ్ సిరీస్ కోసం ఈమెను సంప్రదించారట. కానీ ఈమె పొగరు వల్ల ఆ సిరీస్ చేజారిందని అంటున్నారు.
దీపికా పదుకునే 'ది వైట్ లోటస్'...
పూర్తి వివరాల్లోకి వెళ్తే... సూపర్ హిట్ 'ది వైట్ లోటస్' నాల్గవ సీజన్ కోసం దీపికా పదుకునేను మేకర్స్ సంప్రదించారు. ఆమె సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే పాత్రకు సంబంధించిన ఆడిషన్ కోసం ఆమెను రావాల్సిందిగా మేకర్స్ పిలిచారట. ఆడిషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, డైరెక్ట్ షూటింగ్ అయితేనే వస్తాను అని దీపికా వారికి చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. సాధారణంగా సీనియర్ స్టార్ హీరోయిన్స్ ను ఆడిషన్స్ లేకుండానే తీసుకుంటారు. కానీ హాలీవుడ్ సిరీస్ కనుక దీపికా నుంచి ఆడిషన్స్ ఆషించి ఉంటారు. అందుకు దీపికా ఈగో హర్ట్ అయ్యి ఉంటుందని, అందుకే ఆమె సున్నితంగా తిరస్కరించింది అంటూ ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. తనపై తనకు నమ్మకం ఉండి ఉంటే ఆడిషన్స్ కి వెళ్లి ఉండేదని కొందరు అంటున్నారు. మొత్తానికి దీపికా మరోసారి విమర్శలు ఎదుర్కొంటోంది.
భారీ పారితోషికంతో దీపికా పదుకునే...
సాధారణంగానే దీపికా పదుకునే భారీ పారితోషికం తీసుకుంటుంది అని కొందరు నిర్మాతలు కనీసం ఆమెను సంప్రదించేందుకు కూడా భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమె ఇలాంటి కండీషన్స్ పెడుతూ, ఆడిషన్స్ కు హాజరు కాను, నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తాను అంటే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇకపై అయినా దీపికా ఇలాంటి విషయాల్లో పట్టు విడిపు చూపించకుంటే మరో రెండు మూడు ఏళ్లలో కెరీర్ ఖతం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈమె కు ఉన్న బ్యాడ్ నేమ్ వల్ల చాలా మంది సోషల్ మీడియాలో పొగరు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ పొగరు వల్ల చాలా సినిమాలను మిస్ చేసుకోవడం కాకుండా, చాలా మంది నిర్మాతలతోనూ సున్నం పెట్టుకుంది అంటారు. కానీ దీపికా కు సన్నిహితంగా ఉండేవాల్లు మాత్రం అవన్ని కేవలం పుకార్లే అని కొట్టిపారేస్తూ ఉంటారు.