ఆ నలుగురు... వయసు పెరగడం ఆగిందా?
నాగార్జున సైతం ఒక మంచి సినిమాతో వస్తే వందల కోట్ల వసూళ్లు ఇచ్చేందుకు ఆయన అభిమానులు తెలుగు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.;
టాలీవుడ్ స్టార్ హీరోలు అనగానే కొన్నాళ్ల ముందు వరకు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున పేర్లు ప్రముఖంగా వినిపించేవి. ఇప్పటికీ వీరు నలుగురు టాలీవుడ్‌ను ఏలుతూనే ఉన్నారు. అయితే వీరిపై పోటీగా యంగ్ హీరోలు రావడంతో వీరి డామినేషన్ కాస్త తగ్గిందని చెప్పక తప్పదు. అయితే సాలిడ్ సబ్జెట్ దొరికితే సినిమా ఓ రేంజ్‌లో హిట్ కొట్టి, యంగ్ హీరోలను మించేలా వసూళ్లు సాధిస్తున్నారు ఈ సీనియర్ హీరోలు. ఆ మధ్య సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్, ఇటీవల మన శంకరవర ప్రసాద్ గారు సినిమాతో మెగాస్టార్ చిరంజీవి, అఖండ తో బాలకృష్ణ ఏ స్థాయి వసూళ్లు సాధించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగార్జున సైతం ఒక మంచి సినిమాతో వస్తే వందల కోట్ల వసూళ్లు ఇచ్చేందుకు ఆయన అభిమానులు తెలుగు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నలుగురు హీరోలు ఎవర్‌గ్రీన్ స్టార్స్ అనడంలో అతిశయోక్తి లేదు.
ఆరు పదుల వయసులో వరుస సినిమాలు...
ఈ నలుగురు స్టార్ హీరోల వయసు ఆరు పదులు ఎప్పుడో దాటిన విషయం తెల్సిందే. అయితే ఈ వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. హీరోలుగా వరుస సినిమాలు చేస్తూ, డాన్స్ మూమెంట్స్ తో, యాక్షన్ సీక్వెన్స్‌తో రొమాంటిక్ సీన్స్ తో యూత్ ఆడియన్స్ ను సైతం ఈ నలుగురు స్టార్ హీరోలు మెప్పిస్తున్నారు. అలాంటి స్టార్ హీరోలు ఇప్పుడు లుక్ పరంగా తమను తాము కొత్తగా చూపించేందుకు పోటీ పడుతున్నారు. మన శంకరవర ప్రసాద్ సినిమాలో చిరంజీవి లుక్ అందరికీ షాకింగ్‌గా అనిపించింది. ఆయన నాలుగు పదుల వయసు వ్యక్తిగా కనిపించడం ద్వారా అభిమానులు ఆహా.. ఓహో అంటూ తెగ పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా వెంకటేష్ లుక్ గురించి కూడా ప్రముఖంగా చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్ సినిమా కోసం ఆయన కొత్త లుక్ ను ట్రై చేస్తున్నాడు. ఫ్యామిలీ మూవీ అయినప్పటికీ కాస్త యంగ్ లుక్ లోనే వెంకటేష్ కనిపించబోతున్నాడట.
వెంకటేష్, నాగార్జున లుక్..
ఇటీవల ఒక కార్యక్రమంలో వెంకటేష్ పాల్గొన్నాడు. ఆ సమయంలో ఆయన యంగ్ లుక్ ను చూసి చాలా మంది సర్‌ప్రైజ్ అయ్యారని తెలుస్తోంది. నాలుగు పదుల వయసులో ఉన్నట్లుగా వెంకటేష్ కనిపిస్తున్నాడు అంటూ నెటిజన్లు ఆ ఫోటోలను షేర్ చేస్తూ కామెంట్స్ చేశారు. ఇదే లుక్ తో వెంకటేష్ తన తదుపరి సినిమాలో కనిపిస్తే కచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ మొదటి నుంచి ఆయన చాలా స్పెషల్ లుక్ తో మెప్పిస్తూ వచ్చే వాడు. ఇప్పుడు కూడా ఆయన తన లుక్ తో ఆకట్టుకుంటూ ఉన్నాడు. ఆయన యంగ్ లుక్ తో ఏకంగా ఆయన కొడుకులకే పోటీగా నిలుస్తూ ఉంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే నాగార్జునను సైతం ఎంతో మంది హీరోలు ముఖ్యంగా యంగ్ హీరోలు ఆదర్శంగా తీసుకుంటారు.
చిరంజీవి, బాలకృష్ణ తదుపరి సినిమాలు...
బాలకృష్ణ సైతం ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ యంగ్ కుర్రాడిగా కనిపించేందుకు సాధ్యం అయినంత వరకు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన సినిమాల్లో లుక్ అయినా, బయట లుక్ అయినా ఆయన వయసుతో సంబంధం లేదు అన్నట్లుగానే ఉంటుంది. అందుకే వయసు పెరగడం ఆగిందా అనిపిస్తూ ఉంటుంది. ఒక్క హీరో అని కాకుండా ఈ నలుగురు స్టార్ హీరోలు సైతం వయసు పెరగడం ఆగినట్లు ఉందనే కామెంట్స్ వస్తున్నారు. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా ఆరు పదులు.. ఏడు పదుల వయసు వరకు ఇండస్ట్రీలో కొనసాగడం చూస్తూ ఉంటాం, కానీ పూర్తి స్థాయి కమర్షియల్ హీరోగా మాత్రమే చేయడం చూసి ఉండం. కానీ మన నలుగురు స్టార్ హీరోలు మాత్రం ఇప్పటికీ హీరోగా మాత్రమే సినిమాలు చేస్తూ, తమ అభిమానులను అలరించేందుకు ఈ వయసులోనూ కష్టపడుతున్నారు. ఇలాగే మరో పదేళ్లు.. ఇరవై ఏళ్లు ఈ హీరోలు అభిమానులను ఎంటర్‌టైన్ చేయాలని అంతా కోరుకుంటున్నారు. ఈ హీరోలు ఈతరం హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.