అనిల్ నెక్స్ట్.. నందమూరి ఫ్యాన్స్ మాటేంటి?

టాలీవుడ్‌ లో మల్టీస్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. సినీ ప్రియులు ఎప్పుడూ వాటి కోసం వెయిట్ చేస్తుంటారు.;

Update: 2026-02-27 07:54 GMT

టాలీవుడ్‌ లో మల్టీస్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. సినీ ప్రియులు ఎప్పుడూ వాటి కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లోనే కాకుండా నందమూరి అభిమానుల్లో కూడా హాట్ టాపిక్‌ గా మారింది. ఆయన తన నెక్స్ట్ మూవీ సీనియర్ హీరో వెంకటేష్- నందమూరి కళ్యాణ్ రామ్ తో చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

దీంతో ఇప్పుడు ఆ మల్టీస్టారర్ ప్రాజెక్టుపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. నిజానికి.. రావిపూడి కొత్త మూవీ అనౌన్స్మెంట్ తో సినిమాపై ఆసక్తి పెరిగినా.. అదే సమయంలో నందమూరి ఫ్యాన్స్ లో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి.. అనిల్ కెరీర్ ప్రారంభంలో తెరకెక్కిన పటాస్ సినిమా కళ్యాణ్ రామ్‌ కు మంచి బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించి దర్శకుడికి కూడా గుర్తింపు తెచ్చింది.

అప్పటి నుంచే ఆ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ మళ్లీ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో పటాస్ 2 వంటి సీక్వెల్ చేస్తారని చాలా మంది ఆశించారు. అయితే అలా కాకుండా మల్టీస్టారర్ వైపు అనిల్ వెళ్లడం కొందరిలో నిరాశ కలిగించినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్‌ కు కంప్లీట్ రేంజ్ సోలో సినిమా ఇస్తే బెటర్ అయ్యేదని అంటున్నారు.

హీరో ఇమేజ్‌ ను మరింత పెంచే కథతో రావాల్సిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మల్టీస్టారర్‌ లో స్క్రీన్ స్పేస్, ఇంపార్టెన్స్ తగ్గే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా వెంకటేష్ వంటి సీనియర్ స్టార్‌ తో సినిమా చేస్తున్నప్పుడు రోల్స్ మధ్య బ్యాలెన్స్ చాలా కీలకమని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో మరో ఆసక్తికర విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కళ్యాణ్ రామ్ రోల్ కు మొదట మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ను తీసుకుందామని అనుకున్నారని, కానీ భారీ పారితోషికం ఆఫర్ చేశారనే ఇటీవల రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్‌ లో కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఆ విషయంపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు.

ఇక అనిల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేయడంలో దిట్ట. ఆయన సినిమాల్లో ఫన్ కు పెద్దపీట వేస్తారు. ఈ మల్టీస్టారర్‌ కూడా పూర్తి ఎంటర్టైనర్‌ గా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇద్దరు హీరోలకు ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉండేలా కథతో సినిమా రూపొందిస్తే నందమూరి అభిమానుల అంచనాలు నెరవేరే అవకాశం ఉందని చెప్పాలి. ఏదేమైనా ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా అనిల్ రావిపూడి వెంకీ- కళ్యాణ్ రామ్ కాంబోను ఎలా చూపిస్తారో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News