• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  AK 47 బాక్సాఫీస్.. అసలైన...

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

| వీకెండ్‌లో కలెక్షన్లు పెరగడం ఒక ఎత్తయితే, సోమవారం నుంచి అదే జోరు కొనసాగించడం మరో ఎత్తు. ముఖ్యంగా త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమా విషయంలో ఈ ఛాలెంజ్ మరింత కీలకం.

By - M Prashanth
Update: 2026-11-03 04:27 GMT

వీకెండ్‌లో కలెక్షన్లు పెరగడం ఒక ఎత్తయితే, సోమవారం నుంచి అదే జోరు కొనసాగించడం మరో ఎత్తు. ముఖ్యంగా త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమా విషయంలో ఈ ఛాలెంజ్ మరింత కీలకం. వెంకటేష్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' తొలి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు సాధించింది. అయితే వీకెండ్ ముగిసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోమవారం కలెక్షన్లతో ఈ సినిమా అసలు బాక్సాఫీస్ సత్తాపై మరింత క్లారిటీ వచ్చింది.

అక్టోబర్ 30న విడుదలైన ఈ చిత్రం అంచనా ప్రకారం మొదటి రోజు ఇండియా వైడ్ ట్రాకింగ్‌లో రూ.9.79 కోట్ల గ్రాస్ సాధించింది. శనివారం రూ.11 కోట్లు, ఆదివారం రూ.12.18 కోట్లకు వసూళ్లు పెరిగాయి. కానీ సోమవారం మాత్రం రూ.3.73 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆదివారంతో పోలిస్తే దాదాపు 69 శాతం డ్రాప్ నమోదైంది. నాలుగు రోజుల మొత్తం ట్రాక్డ్ గ్రాస్ రూ.36.70 కోట్లకు చేరుకుంది.

నార్మల్ గా వీకెండ్ తర్వాత సోమవారం కలెక్షన్లు తగ్గడం ఆశ్చర్యం కాదు. అయితే ఇక్కడ డ్రాప్ ఎంత ఉందనేదే పాయింట్. ఆదివారం దాదాపు 49 శాతంగా ఉన్న థియేటర్ ఆక్యుపెన్సీ సోమవారం 19.5 శాతానికి పడిపోయింది. మొదటి రోజు రూ.9.79 కోట్లు రాగా, నాలుగో రోజు అందులో సగం కూడా రాలేదు. అంటే వీకెండ్‌లో సినిమాను చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్యతో పోలిస్తే వర్కింగ్ డేలో థియేటర్లకు వచ్చే వాళ్లు బాగా తగ్గిపోయారు.

ఇప్పటికే ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ మీద పెట్టుకున్న అంచనాల స్థాయిలో రెస్పాన్స్ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంకటేష్‌తో ఆయన కాంబినేషన్ అనగానే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్‌కు మంచి ఆదరణ ఉంటుందని భావించారు. కానీ విడుదల తర్వాత వచ్చిన టాక్, కలెక్షన్లను చూస్తే ఆ స్థాయిలో ఊపు కనిపించడం లేదు. అలాగని నాలుగు రోజుల నంబర్లతోనే సినిమాను డిజాస్టర్‌గా తేల్చేయడం కూడా తొందరపాటే. దీపావళి వరకు లెక్క మారుతుందేమో చూడాలి.

మరోవైపు వెంకటేష్ గత చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'తో పోలిక కూడా తప్పడం లేదు. ఆ సినిమా సంక్రాంతి సెలవులను ఉపయోగించుకుని ఫ్యామిలీ ఆడియన్స్‌ను భారీగా థియేటర్లకు రప్పించింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కూడా వసూళ్లకు బాగా కలిసొచ్చింది. ఇప్పుడు త్రివిక్రమ్ కాంబినేషన్ కు అదే బజ్ వస్తుందని అనుకుంటే అలాంటి స్పందన కనిపించడం లేదు. రెండు సినిమాల రిలీజ్ సీజన్లు వేరు కావడంతో కలెక్షన్లను నేరుగా పోల్చలేం. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి వస్తున్న ఆదరణలో తేడా మాత్రం కనిపిస్తోంది. ఇక మంగళ, బుధవారాల కలెక్షన్లు ఈ సినిమాకు మరింత కీలకం కానున్నాయి. సోమవారం స్థాయిలోనైనా వసూళ్లు నిలబడతాయా, లేక మరింత తగ్గుతాయా అనేది చూడాలి.

Tags:    
  • adarshakutumbam 
  • venkatesh 
  • trivikram 
  • tollywood 
  • boxoffice 

Similar News

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

బాలీవుడ్ హీరో అని పిలవకండి..రణ్‌బీర్ కపూర్ మాస్ స్టేట్‌మెంట్!

2026-11-03 08:23 GMT

బ్రేకప్ రూమర్స్‌కు స్టార్ హీరోయిన్ చెక్..ఆ ఫొటోలు షేర్ చేస్తూ క్లారిటీ!

2026-11-03 08:21 GMT

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS