పాన్ సౌత్ రేస్‌లో కయాదు.. గేమ్ చేంజర్‌గా ది ప్యారడైజ్?
సౌత్ సినీ పరిశ్రమలో వేగంగా ఎదుగుతున్న యంగ్ హీరోయిన్లలో కయాదు లోహర్ కూడా ఒకరు. రీసెంట్ గా ఆమె తన కెరీర్ ను మలచుకుంటున్న విధానం ప్రత్యేకంగా నిలుస్తోంది.;
సౌత్ సినీ పరిశ్రమలో వేగంగా ఎదుగుతున్న యంగ్ హీరోయిన్లలో కయాదు లోహర్ కూడా ఒకరు. రీసెంట్ గా ఆమె తన కెరీర్ ను మలచుకుంటున్న విధానం ప్రత్యేకంగా నిలుస్తోంది. అందులో భాగంగానే టాలీవుడ్‌లో కయాదు ఫ్యూచర్ ను డిసైడ్ చేసే సినిమాగా ది ప్యారడైజ్ రాబోతుంది. నేచురల్ స్టార్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా సక్సెస్ అందుకుంటే, కయాదు లోహర్ కు తెలుగులో అది గేమ్ ఛేంజర్ అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
కీలక పరీక్షగా మారిన ది ప్యారడైజ్
కయాదు ఇప్పటికే టాలీవుడ్‌లో తన టాలెంట్ ను చూపించినప్పటికీ, ఒక స్ట్రాంగ్ కమర్షియల్ హిట్ మాత్రం ఆమెకు దక్కాల్సి ఉంది. ఇలాంటి టైమ్‌లో ది ప్యారడైజ్ ఆమెకు కీలక పరీక్షగా మారింది. నాని సినిమాలు సాధారణంగా కంటెంట్ ఆధారంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కూడా అదే రీతిలో సక్సెస్ అయితే, కయాదుకు టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. మరీ ముఖ్యంగా యంగ్ హీరోల సరసన, మిడ్‌రేంజ్ బడ్జెట్ చిత్రాల్లో ఆమె పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది.
పలు భాషల్లో సినిమాలు
ఇదిలా ఉంటే, కయాదు కేవలం తెలుగు భాషకే పరిమితం కాలేదు. సౌత్ ఇండస్ట్రీల్లో ఆమె వరుస సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఆమె చేతిలో ఉన్న మలయాళ సినిమాలు పల్లిచట్టాంబి, ఐ యామ్ ది గేమ్, తారమ్ మంచి ఆసక్తిని రేకెత్తిస్తుండగా, తమిళంలో ఇదయమ్ మురళి, ఇమ్మోర్టల్ తో పాటూ శింబు49 సినిమాలో కూడా అవకాశం దక్కించుకోవడం ఆమె క్రేజ్ కు అద్దం పడుతుంది. భాషలకు అతీతంగా కయాదు అవకాశాలు అందుకోవడం ఆమె కెరీర్ ప్లానింగ్ విషయంలో ఎంత క్లారిటీగా ఉందనేది తెలియచేస్తోంది.
స్టార్ రేస్ లోకి వెళ్లాలనే ప్లాన్
ఈ పరిణామాల మధ్య, కయాదు లోహర్ స్టార్ రేస్‌లోకి అడుగుపెడుతున్నదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. యంగ్ బ్యూటీగా ప్రారంభమైన ఆమె కెరీర్ జర్నీ, ఇప్పుడు పాన్ సౌత్ స్థాయికి చేరువవుతోంది. వరుసగా మల్టీలాంగ్వేజ్ ప్రాజెక్టులు చేయడం ద్వారా విభిన్న ప్రేక్షక వర్గాలకు చేరువ కావాలనే లక్ష్యంతో కయాదు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా కంటెంట్‌కు ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకోవడం ఆమెకు కలిసొచ్చే అంశంగా మారొచ్చు.
అయితే, ఈ మొత్తం ప్రయాణంలో ది ప్యారడైజ్ రిజల్ట్ కయాదుకి ఎంతో కీలకం. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే, టాలీవుడ్‌లో ఆమె స్థానం మరింత బలపడుతుంది. అదే సమయంలో ఇతర భాషల్లో చేస్తున్న సినిమాల రిజల్ట్స్ కూడా ఆమె మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయి. సరైన సమయంలో సరైన ప్రాజెక్టులు ఎంచుకుంటే, కయాదు లోహర్ సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె కెరీర్ ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. ఈ దశను కయాదు ఎలా మలుచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.