సుహాస్ రేసిజం కాంట్రవర్సీ.. అసలు తెలుగోళ్లకు రంగుతో పనేంటి?

తన రంగుపై కొందరు దారుణంగా వ్యాఖ్యలు చేశారని సుహాస్ చెప్పడంతో తాను ధైర్యం చెప్పానని వెల్లడించారు. తమిళనాడులో రేసిజం కు తావు లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Update: 2026-09-18 04:56 GMT

సినిమా అంటేనే గ్లామర్.. హీరో అంటే అందంగా ఉండాలనే ఆలోచన ఇప్పటికీ కొందరిలో కనిపిస్తుంది. కానీ టాలెంట్‌ కు రంగుతో సంబంధం లేదని తెలుగు సినిమా ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది. లేటెస్ట్ గా యాక్టర్ సుహాస్ విషయంలో రేసిజం కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారగా, అసలు తెలుగు ఆడియన్స్ సుహాస్‌ ను ఎప్పుడైనా రంగు విషయంలో దూరం పెట్టారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సుహాస్ నటించిన మండాడి సినిమా సక్సెస్ మీట్‌ లో డైరెక్టర్ మతిమారన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. షూటింగ్ సమయంలో సుహాస్ తన సొంత ఊర్లో ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని బాధగా చెప్పుకున్నారని దర్శకుడు తెలిపారు. తన రంగుపై కొందరు దారుణంగా వ్యాఖ్యలు చేశారని సుహాస్ చెప్పడంతో తాను ధైర్యం చెప్పానని వెల్లడించారు. తమిళనాడులో రేసిజం కు తావు లేదని ఆయన వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. తెలుగులో అవకాశాలు లేకపోయినా కోలీవుడ్ సుహాస్‌ ను స్వాగతిస్తుందని దర్శకుడు చేసిన కామెంట్స్ కూడా చర్చకు దారితీశాయి. దీంతో కొందరు నెటిజన్లు తెలుగు ప్రేక్షకులు సుహాస్‌ కు ఇచ్చిన సపోర్ట్‌ ను గుర్తుచేస్తున్నారు. సుహాస్‌ కు గుర్తింపు రావడంలో తెలుగు ప్రేక్షకుల రెస్పాన్స్ మెయిన్ అని చెబుతున్నారు. సుహాస్ తెలుగులో ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు. హీరోగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

సినిమాలు హిట్ అయితే ఆడియన్స్ ఆయన యాక్టింగ్ ను మెచ్చుకున్నారు. ఒకవేళ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడుకున్నారు. కానీ సుహాస్ రంగుపై తెలుగు సినిమా ప్రేక్షకులు పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన సందర్భాలు కనిపించలేదనే వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావనకు వస్తుంది. మన డైలీ లైఫ్ లో ఫ్రెండ్స్ మధ్య బాడీ, కలర్ పై కామెంట్స్ చేసుకోవడం కొత్తేమీ కాదు.

అయితే అలాంటి మాటలు ఒక రేంజ్ కు వచ్చాక పట్టించుకోకుండా ముందుకు వెళ్లడం సాధారణం. అదే సమయంలో రంగు ఆధారంగా ఒక వ్యక్తిని తక్కువగా చూడటం మాత్రం వేరే విషయం. దానిని సమర్థించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేక్షకుల విషయానికి వస్తే.. మంచి సినిమా, యాక్టింగ్ ఉంటే ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోరని చెప్పడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.

కోలీవుడ్ సూపర్‌ స్టార్ రజినీకాంత్‌ కు తెలుగులో ఉన్న క్రేజ్ దానికి ఒక ఎగ్జాంపుల్. ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించారు.. ఆదరిస్తున్నారు కూడా. ధనుష్, విజయ్ సేతుపతి వంటి తమిళ నటుల సినిమాలకూ తెలుగు ఆడియన్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అంటే హీరో ఎలా కనిపిస్తున్నాడన్న దానికంటే స్క్రీన్ పై ఎలా మెప్పిస్తున్నాడన్నదే ముఖ్యం.. మంచి సినిమా ఇస్తే ఎక్కడి నటుడినైనా ఆదరించడం, నచ్చితే గుండెల్లో పెట్టుకోవడం తెలుగు ప్రేక్షకుల స్పెషాలిటీ అని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.



Tags:    

Similar News