• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ స్టార్‌ అరబిక్...

సూపర్ స్టార్‌ అరబిక్ కుత్తు ప్రోమోకు సూపర్‌ రెస్పాన్స్‌

By - Tupaki Desk
Update: 2022-02-09 09:03 GMT
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌ గా నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన బీస్ట్‌ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ను ఈ సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన హడావుడి తమిళ సోషల్‌ మీడియాలో మొదలు అయ్యింది.

 తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అనిరుద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మొదటి పాట ప్రకటన రావడంతో అభిమానులు మరింత ఉత్సాహంతో పాట కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఈ సమయంలో ఫిబ్రవరి 14న బీస్ట్‌ మూవీ నుండి మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మొదటి పాట గా అరబిక్ కుత్తును అనిరుద్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. ఆ విషయాన్ని ప్రోమో రూపంలో షేర్‌ చేశారు.

నాలుగు అయిదు నిమిషాల పాట కోసం ఆరు నిమిషాల ప్రోమోను నిన్న విడుదల చేసిన విషయం తెల్సిందే. ఆ ప్రోమో లో దర్శకుడు నెల్సన్‌ సంగీత దర్శకుడు అనిరుద్ మరియు ఆ పాటను రాసిన శివ కార్తికేయన్ లు సరదాగా ముచ్చటించుకోవడం చూపించారు. చివర్లో విజయ్ కూడా ఈ ముగ్గురితో ఫోన్ లో మాట్లాడటం ఆ వీడియోలో చూడవచ్చు. భాష తో సంబంధం లేకుండా ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌ లో భారీ వ్యూస్‌ ను దక్కించుకుంటుంది.

పాట అనౌన్స్ చేయడం కోసం సరదాగా నెల్సన్ మరియు అనిరుద్ లు ప్లాన్‌ చేసిన ఈ వీడియో కాస్త పాట పై అంచనాలను ఆకాశమే హద్దు అన్నట్లుగా పెంచేసింది. ఈ వీడియో కొన్ని గంటల్లోనే ఏకంగా 10 మిలియన్ ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.

ఒక పాటను ఇలా కూడా ప్రకటిస్తారా అంటూ ప్రతి ఒక్క సినీ అభిమాని మరియు సంగీత ప్రియులు కూడా ఈ వీడియోను ఆసాతం చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి బీస్ట్‌ యొక్క మొదటి పాట ప్రోమో నెట్టింట చేస్తున్న సందడి చూస్తుంటే పాట విడుదల తర్వాత ఆ పాట అయినా ఇన్ని వ్యూస్ ను దక్కించుకుంటుందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇప్పటి వరకు అనిరుద్‌ ఎన్నో రకాల కుత్తు పాటలను ట్యూన్ చేశాడు. విజయ్ గత చిత్రం మాస్టర్ లో అనిరుద్‌ చేసిన మాస్టర్ కమింగ్ పాట తరహాలో ఉండే పాటలను కుత్తు అంటారు. బీస్ట్‌ లో కూడా కుత్తు ను ప్లాన్‌ చేశాడు.. అది కూడా అరబిక్ కుత్తు అవ్వడం వల్ల తమిళ ప్రేక్షకులు నోరు వెళ్లబెడుతున్నారు. ఈ పాట భాష తో సంబంధం లేకుండా గతంలో అనిరుద్‌ ఇచ్చిన కొలవెరిడి తరహాలో వైరల్‌ అవ్వబోతుంది అంటూ మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. అరబిక్ కుత్తు సాంగ్‌ ప్రోమోకే ఇంత రెస్పాన్స్ వస్తే ఇక పాట విడుదల అయిన తర్వాత మరెంత హంగామా ఉంటుందో చూడాలి.

Tags:    
  • Beast 
  • vijay 
  • kollywood 
  • anirudh 
  • songpromo 
  • latestpromo 

Similar News

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Copyright @2026

Powered by Blink CMS