• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తొమ్మిదో ఏట అడుగుపెట్టిన...

తొమ్మిదో ఏట అడుగుపెట్టిన సూపర్ కిడ్ సితార పాప..!

By - Tupaki Desk
Update: 2021-07-20 06:35 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రత శిరోద్కర్ ముద్దుల తనయ, లిటిల్ ప్రిన్సెస్ సితార కు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సితార పాప చేసే అల్లరి వీడియోలు.. సింగింగ్‌ - డ్యాన్సింగ్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. మహేష్ - నమ్రతలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా మధ్యమాలలో అభిమానులతో పంచుకుంటారు. ఇంత చిన్న వయసులోనే దర్శకుడు వంశీ పైడిప‌ల్లి కూతురు ఆద్య‌తో క‌లిసి 'ఎ అండ్ ఎస్' అనే ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది సితార. ఇలా తన తల్లిదండ్రుల వల్లనే కాకుండా తన టాలెంట్ తో సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న సితార.. ఒక సెలబ్రిటీ అయిపోయింది.

ఇదిలా ఉంటే లిటిల్ క్యూట్ సితార పాప ఈరోజు తొమ్మిదవ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అభిమానులు స్టార్ కిడ్ కు బర్త్ డే విషెస్ అందిస్తూ.. '#SitaraTurns9' అనే హ్యాష్‌ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ లో నిలిపారు. ఫ్యామిలీ మెంబెర్స్ కూడా సోషల్ మీడియా ద్వారా సితార పై ప్రేమను కురిపించారు. తండ్రి మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. ''నా చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు!! నా ప్రపంచాన్ని ఎల్లప్పుడూ వెలిగిస్తుంది. హ్యాపీ 9! నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను!" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బెలూన్స్ ప‌ట్టుకున్న సితార ఫొటోను షేర్ చేశారు మహేష్.

హ్యాపీ మదర్ నమ్రత శిరోద్కర్ ట్వీట్ చేస్తూ.. ''ఈ రోజుతో 9 సంవత్సరాలు! నీ ఎదుగుదల చూడటం నాకు గొప్ప ఆనందం. ఎల్లప్పుడూ ఆకాశాన్ని లక్ష్యంగా పెట్టుకో! పుట్టినరోజు శుభాకాంక్షలు సితార!! నీకు మరింత ప్రేమ మరియు దీవెనలు'' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సితార చిన్ననాటి ఫొటోలతో చేసిన ఓ వీడియోని పంచుకున్నారు. ఇక చివరగా మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా తన ముద్దుల చెల్లెలు పార్టనర్-ఇన్-క్రైమ్ అని చెబుతూ బర్త్ డే విషెస్ అందజేశాడు. "ఆమె నాకు చాలా కోపం తెప్పిస్తుంది కాని ఆమె లేకుండా ఒక రోజు కూడా నేను ఊహించుకోలేను! నా గూఫ్‌ బాల్.. పార్టనర్-ఇన్-క్రైమ్.. నా లిటిల్ సిస్టర్. పుట్టినరోజు శుభాకాంక్షలు సితార.. లవ్ యూ సో మచ్'' అని గౌతమ్ రాసుకొచ్చాడు.

Tags:    
  • sitara 
  • mahesh babu 
  • namrta 
  • mahesh babu daughter 
  • 9th birth day 
  • mehesh babu family 
  • birth day celebrations 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS