పరదా చాటున సన్నీ.. భయంభయంగా

Update: 2017-01-24 07:58 GMT
బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సన్నీ లియోన్ కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది. పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ గా టర్న్ అయ్యి.. అడల్ట్ కంటెంట్ సినిమాల నుంచి ఇప్పుడు నేరుగా మెయిన్ స్ట్రీమ్ సినిమా.. అది కూడా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ మూవీలో నటించే వరకూ ఎదిగిపోయింది సన్నీ. ఈ నెల 25న రిలీజ్ కానున్న రాయీస్ మూవీలో సన్నీ లియోన్ 'లైలా మై లైలా' అంటూ షారూక్ తో కలిసి చిందులేసింది.

రాయీస్ ప్రమోషన్ లో భాగంగా వడోదర రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి మరణించాడు. ఆ సమయంలో అదే రైల్ లో షారూక్ తో పాటు సన్నీ లియోన్ కూడా ఉంది. షారూక్ మైక్ ద్వారా నాలుగు మాట్లాడినా.. సన్నీ లియోన్ మాత్రం కనీసం జనాలకు మొహం చూపించే ధైర్యం చేయలేదు. పైగా.. బైట అంతమంది జనాలను చూసి భయపడిపోయింది సన్నీ లియోన్. భయంతో తన సీట్ ని అతుక్కుపోయి కూర్చున్న సన్నీ.. కర్టెన్ సన్నగా తొలగించి బయట హడావిడిని కళ్లారా చూసింది.

ఆ సమయంలో సన్నీ కళ్లలో కనిపిస్తున్న భయం చూస్తే.. అక్కడ ఏ స్థాయిలో హడావిడి నెలకొందో అర్ధమవుతుంది. ఆ జనం అంతా తన కోసం వచ్చారని అనుకోకపోయినా.. అంత మంది అభిమానులను.. అది కూడా అంత హంగామా మధ్య చూసేసరికి.. సన్నీ లియోన్ విపరీతంగా వణికిపోయిందట. ఇక రాయీస్ మూవీలో సన్నీ చేసిన ఐటెం సాంగ్ ఇప్పటికే ఛార్ట్ బస్టర్ గా నిలవగా.. మూవీ రిలీజ్ తర్వాత తనకు మరిన్ని మంచి ఆఫర్స్ వస్తాయని సన్నీ లియోన్ ఆశలు పెట్టుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News