• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేరళలో సన్నీలియోన్.....

కేరళలో సన్నీలియోన్.. ఫ్లైట్ దిగగానే నిర్బంధంలోకి.. వేదనలో ఫ్యాన్స్

By - Tupaki Desk
Update: 2021-01-27 14:30 GMT
బాలీవుడ్ శృంగార తార సన్నిలియోన్ గురించి తెలియని సినీ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటించిందీ శృంగార తార‌. లాక్ డౌన్ కు ముందు అమెరికా వెళ్లిన ఈ బ్యూటీ.. ఈ మ‌ధ్య‌నే ఇండియాకు తిరిగి వ‌చ్చింది. తాజాగా గాడ్స్ ఓన్ కంట్రీ కేర‌ళ‌కు వెళ్లింది. అయితే.. అక్క‌డ‌కు వెళ్ల‌గానే గృహ‌ నిర్బంధంలోకి వెళ్లాల్సి వ‌చ్చింది.

ద‌క్షిణాదిలో స‌న్నీ చేసిన తొలి చిత్రం 'వడా కర్రీ' తమిళ్ లో ఈ సినిమా చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ లో కరెంట్ తీగ, పీఎస్‌యూ గరుడవేగ చిత్రాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత‌.. క‌న్న‌డ, మలయాళ ఇండ‌స్ట్రీల్లోనూ ప్రవేశించింది స‌న్నీ. కాగా.. కేర‌ళ‌లో ఈ అమ్మ‌డికి భారీగానే అభిమానులు ఉన్నారు. గ‌తంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేరళకు వెళ్లిన సన్నీలియోన్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు కూడా మ‌రోసారి అక్క‌డికి వెళ్లిందీ బ్యూటీ.

తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి త్రివేండ్రం ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ దిగిన త‌ర్వాత వెంట‌నే ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్టు పెట్టింది స‌న్నీ లియోన్‌. 'గాడ్స్ ఓన్ కంట్రీగా భావించే నా ఇష్టమైన ప్రదేశం కేరళకు చేరుకొన్నాను. స్ల్పిట్ విల్లా అనే టీవీ షో షూటింగ్‌ కోసం వచ్చాను' అని రాసుకొచ్చింది.

అయితే.. కేరళలో కొవిడ్ కేసులు ఎక్కువగానే న‌మోదవుతున్న విష‌యం తెలిసిందే. దీంతో.. బ‌య‌టి నుంచి ఎవ‌రు వ‌చ్చినా క్వారంటైన్ లోకి వెళ్లాల్సిందే. ఈ క్ర‌మంలో స‌న్నీ కూడా ఐసోలేష‌న్లోకి వెళ్లింది. 'దయచేసి అవుట్ డోర్ లొకేషన్‌‌కు అభిమానులు రావొద్దు. కరోనా పరిస్థితుల కారణంగా నాకు ఎంత దూరం ఉంటే అంత మంచింది. నేను కూడా సాధ్యమైనంత వరకు కేరళలోని లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తాను' అని పేర్కొంది సన్నిలియోన్. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు సన్నీలియోన్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయినట్టు సమాచారం.

కాగా.. సన్నీలియోన్ కేరళలో సుమారు నెల రోజులపాటు ఉంటారనేది సమాచారం. ఇందుకోసం ప్రైవేట్ రిసార్టును బుక్ చేసుకొన్నట్టు తెలుస్తోంది. ఇక సన్నీ కెరీర్ విషయానికి వస్తే.. హిందీ, తెలుగు భాషల్లో రూపొందే కోకా కోలా, హెలెన్ చిత్రాల్లో.. అలాగే కోటిగుబ్బా-3 అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది. వీటితోపాటు మరో హిందీ చిత్రంలో నటిస్తోంది సన్నీ.
Tags:    
  • Bollywood 
  • Latest News 
  • Tupaki News 
  • Movie News 
  • Latest Updates 
  • Tupaki Updates 
  • Daily Reports 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS