`శాంతాబాయి`గా స‌న్నీ స్పెష‌ల్ సాంగ్ కిర్రాకే

Update: 2021-06-07 19:30 GMT
ఐటమ్ నంబ‌ర్ల స్పెష‌లిస్టుగా స‌న్నీలియోన్ కి ప్ర‌త్యేక ఇమేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. బేబి డాళ్ మొద‌లు పింక్ లిప్స్ వ‌ర‌కూ స‌న్నీ ఇటీవ‌ల ఓ ఊపు ఊపింది. లైలా... మోహా ముందిరి పాట‌ల్లోనూ త‌న‌దైన మార్క్ వేసింది స‌న్నీ.

సౌత్ లోనూ స‌న్నీకి బోలెడంత ఇమేజ్ ఉంది. మంచు మ‌నోజ్ `క‌రెంట్ తీగ` చిత్రంలో స‌న్నీ ఓ స‌న్నీ అంటూ సాగే పాట‌లో అద‌ర‌గొట్టింది. స్పెష‌ల్ నంబ‌ర్ల‌లో వేడెక్కించే వ‌య్యారం వ‌డ్డించ‌డంలో స‌న్నీకి ఉన్న ఇమేజ్ వేరే లెవ‌ల్ అని చెప్పాలి. కిచ్చా సుదీప్ నటించిన కోటిగోబ్బా 3 లో ఆమె ప్రత్యేక డ్యాన్స్ నెంబర్ లో కూడా కనిపించనుంది. స‌న్నీ త‌న‌వైన డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు.

ఇంత‌లోనే మరాఠీ చిత్రం `ఆమ్దార్ నివాస్` లో `శాంతాబాయి`గా ప్ర‌త్యేక గీతంలో క‌వ్వించ‌నుంది. స‌న్నీ నృత్య‌భంగిమ‌ల‌కు సంబంధించిన కొన్ని ఆన్ లొకేష‌న్ ఫోటోలు అంత‌ర్జాలంలో సునామీలా పోటెత్తాయి. ఈ చిత్రంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ పాత్రలో రోహిత్ చౌదరి ప్రధాన పాత్రలో నటించారు. సాయాజీ షిండే ఒక రాజ‌కీయ నాయ‌కుడిగా క‌నిపించ‌నున్నారు. ఆ ఇద్ద‌రూ సన్నీతో స్టెప్పులేస్తున్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

శాంతాబాయి పాట కోసం.. సన్నీ లియోన్ మహారాష్ట్ర కోలి స్టైల్ వేషధారణలో పసుపు జాకెట్టు -ధోతితో కనిపిస్తోంది. ఈ పాట ఆహ్లాదకరమైన ఎన‌ర్జిటిక్ డ్యాన్స్ నంబర్ అన్న టాక్ వినిపిస్తోంది. ఇక స‌న్నీలియోన్ న‌టిస్తున్న వారియ‌ర్ మూవీ వీర‌మాదేవి అప్ డేట్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. మ‌రోసారి తెలుగు  స‌ర్కిల్స్ లోనూ ఏదైనా ఐట‌మ్ నంబ‌ర్ తో ప‌ల‌క‌రిస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News