• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వావ్.. పవన్ సినిమాలో

వావ్.. పవన్ సినిమాలో

By - Tupaki Desk
Update: 2016-12-12 10:19 GMT
హీరో అవతారం ఎత్తిన తొలి నాళ్లలో క్యారెక్టర్ రోల్స్ కూడా చేసేవాడు సునీల్. ‘పూల రంగడు’ లాంటి హిట్టు కొట్టాక కూడా అతను తన డైరెక్టర్ ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఖలేజా’ చేశాడు. కానీ ఆ తర్వాత మాత్రం నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్ కు దూరమైపోయాడు. హీరో వేషాలకే పరిమితం అయిపోయాడు. సునీల్ ను కమెడియన్ గా జనాలు చాలా మిస్సవుతున్నా.. అతను మాత్రం హీరోగానే కంటిన్యూ అవుతూ వచ్చాడు. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’లో హీరో వెంటే ఉండే ముఖ్య పాత్రకు అడిగినా.. డేట్ల సమస్య వల్ల ఒప్పుకోలేదు సునీల్.

ఐతే ఎట్టకేలకు సునీల్ మళ్లీ నాన్-హీరో వేషంలో కనిపించబోతున్నట్లు సమాచారం. సునీల్ కోసం అతడి మిత్రుడైన త్రివిక్రమే ఓ స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేశాడట. అది కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో కావడం విశేషం. ఆల్రెడీ ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రం కొత్త ఏడాదిలో సెట్స్ మీదికి వెళ్లనుంది. గతంలో సునీల్ కోసం అదిరిపోయే కామెడీ క్యారెక్టర్లు డిజైన్ చేసిన త్రివిక్రమ్.. వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో తన కొత్త సినిమాలోనూ పాత్రను తీర్చిదిద్దినట్లు సమాచారం. ఈ సినిమాలో సునీల్ పాత్ర క్లిక్కయితే అతను మళ్లీ వరుసగా కామెడీ వేషాలు వేసే అవకాశాలున్నాయి. సునీల్ హీరోగా ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘ఉంగరాల రాంబాబు’తో పాటు ఎన్.శంకర్ డైరెక్షన్లో ‘టు కంట్రీస్’ రీమేక్‌ లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Tags:    
  • Sunil 
  • pawan Kalyan 
  • Trivikram Movie 
  • Telugu News 
  • Telugu Cinema News 
  • Tollywood 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS