దేవరకొండ మూవీకి మరొక అట్రాక్షన్..ఫైటర్లో బాలీవుడ్ బడా స్టార్

Update: 2020-10-19 09:10 GMT
యువ సంచలనం విజయ్ దేవరకొండ కలల చిత్రం ఫైటర్. ఎన్నో రోజులుగా  ఎదురుచూస్తున్న బాలీవుడ్ ఎంట్రీకి ఇది కచ్చితంగా మంచి  బేస్ ఇస్తుందని అతడి నమ్మకం. ఈ సినిమాను స్పీడ్ సినిమాల డైరెక్టర్ పూరీ జగన్నాథ్  దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూరీ హీరోయిన్ ఛార్మి తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పాన్  ఇండియా అప్పీల్  ఉండడంతో దక్షిణాది భాషలతో పాటు  హిందీలోనూ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని మెజారిటీ పార్టీ ముంబైలోనే చిత్రీకరించారు. ఈ కథ నచ్చి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇందులో భాగస్వామ్యమయ్యారు. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రస్తుతం ఏ సినిమాకు మరో అదనపు ఆకర్షణ చేకూరింది.

బాలీవుడ్ లో ప్రముఖ స్టార్ గా  వెలుగొందుతున్న సునీల్ శెట్టి ఇందులో నటించడానికి అంగీకరించారట. ఇందులో ఫ్లాష్ బ్యాక్ లో  విజయ్ తండ్రిగా సునీల్ శెట్టి నటిస్తున్నారని, ఆయనది డాన్ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ  సినిమాలో ఆయన లెంగ్త్ ఓ 15 నిమిషాలపాటు ఉండొచ్చని సమాచారం. బాలీవుడ్ లో స్టార్ గా వెలుగొందాలని కలలుకంటున్న విజయ్ దేవరకొండ.. బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇందుకోసం ఎంతో కష్టపడి సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. మరోవైపు పూరిజగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.
Tags:    

Similar News