మరో దంగల్ ప్లాన్‌ చేస్తున్న సూపర్‌ స్టార్‌...?

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ ఆమీర్ ఖాన్‌ విభిన్నమైన కథలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు.;

Update: 2026-04-17 06:59 GMT

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ ఆమీర్ ఖాన్‌ విభిన్నమైన కథలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. కమర్షియల్‌ హిట్‌ కొట్టి దశాబ్దకాలం దాటినప్పటికీ అమీర్‌ ఖాన్‌ మాత్రం రెగ్యులర్‌ రొటీన్‌ ఫార్మట్‌ సినిమాలను చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఒకటి రెండు చిన్న, గెస్ట్‌ రోల్స్ చేసినప్పటికీ ఎక్కువ శాతం ఈ వయసులోనూ హీరోగానే నటించేందుకు ఆసక్తి కనబర్చుతున్నాడు. అమీర్‌ ఖాన్‌ బయోపిక్‌లపై ఆసక్తి కనబర్చుతూ ఉంటాడు. ఇప్పటికే దంగల్ వంటి సూపర్‌ హిట్ బయోపిక్‌ ను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు దంగల్‌ క్రియేట్‌ చేసిన రికార్డ్‌లను ఏ ఒక్క మూవీ కూడా బ్రేక్ చేయలేక పోయింది అంటే ఆ సినిమా స్టామినా, స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మళ్లీ ఆ స్థాయి హిట్‌ కోసం అమీర్ ఖాన్‌ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమీర్‌ ఖాన్‌ సైతం అదే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

దంగల్‌ సినిమాతో ఆమీర్ ఖాన్‌...

అమీర్‌ ఖాన్‌ దంగల్‌ సినిమాను మహావీర్‌ సింగ్‌ ఫోగట్‌ జీవిత చరిత్ర ఆధారంగా చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో అమీర్ ఖాన్‌ వయసు మీద పడ్డ వ్యక్తిగా కనిపించి సర్‌ప్రైజ్‌ చేసిన విషయం తెల్సిందే. అమీర్ ఖాన్‌ మళ్లీ ఆ తరహా సినిమాను చేయడం కోసం కథలను అన్వేషిస్తున్నాడు అంటూ చాలా రోజులుగా ఆయన సన్నిహితులు సోషల్‌ మీడియా ద్వారా చెబుతూ వచ్చారు. ఎట్టకేలకు అమీర్‌ ఖాన్‌ కోరుకున్న కథ లభించిందని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అమీర్‌ ఖాన్‌ తన తదుపరి సినిమా కోసం ఒక నిజ జీవిత కథను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌ పే సహ వ్యవస్థాపకుడు అయిన అష్నీర్‌ గ్రోవర్‌ జీవిత కథ ఆధారంగా సినిమాను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన జీవితంతో సినిమాను చేయడం వల్ల ఎంతో మందికి ఆదర్శనీయంగా ఉండవచ్చు అనేది అమీర్‌ ఖాన్ ఆలోచన అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

అష్నీర్‌ గ్రోవర్‌ జీవిత చరిత్ర....

స్టార్టప్ కంపెనీ ఎలా పెట్టాలి, దాన్ని అంతర్జాతీయ స్థాయికి ఎలా తీసుకు వెళ్లాలి అనే విషయాలను అష్నీర్‌ గ్రోవర్‌ తన ప్రయాణంలో అందరికి చేసి చూపించాడు. అందుకే ఆయన జీవిత చరిత్రను ఆమీర్‌ ఖాన్‌ ఎంపిక చేసుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆమీర్‌ ఖాన్‌ ఇప్పటికే అష్నీర్‌ గ్రోవర్‌ కథ పై వర్క్‌ చేస్తున్నాడని, చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. బయోపిక్‌ కి అనుమతులు లభిస్తే పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ ను రెడీ చేసి, ఇదే ఏడాది చివరకు వరకు పట్టాలు ఎక్కించే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బయోపిక్‌లకు ఉన్న ఆధారణ నేపథ్యంలో ఆమీర్‌ ఖాన్‌ ఈ సినిమా చేస్తే కచ్చితంగా మంచి బిజినెస్ జరగడంతో పాటు, ప్రేక్షకుల్లోనూ బజ్ క్రియేట్‌ కావడం ఖాయం అంటూ ఆయన అభిమానులు ధీమాతో ఉన్నారు.

సితారే జమీన్‌ ఫర్‌ సినిమాతో....

ఆమీర్‌ ఖాన్‌ హిట్‌ కొట్టక చాలా ఏళ్లు అవుతోంది. అందుకే ఆయన ఈసారి ఎలాగైనా గట్టి హిట్‌ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. గత ఏడాది ఆమీర్ ఖాన్‌ సితారే జమీన్‌ ఫర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా టాక్‌ పాజిటివ్‌గా వచ్చినా వసూళ్లు నిరాశ పరిచాయట. అంతకు ముందు లాల్ సింగ్ చద్దా, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్‌ సినిమాలు పెద్ద డిజాస్టర్‌లుగా నిలిచాయి. అందుకే ఆమీర్‌ ఖాన్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరోల పోటీలో వెనక పడ్డాడు. షారుఖ్‌ ఖాన్‌ వరుస విజయాలు దక్కించుకుంటూ దూసుకు పోతున్నాడు, సల్మాన్‌ సైతం ఫామ్‌ తో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలాంటి సమయంలో ఆమీర్‌ ఖాన్‌ పుంజుకోవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. అందుకు ఈ బయోపిక్‌ కచ్చితంగా ఉపయోగపడుతుందనే అభిప్రాయంను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బయోపిక్‌ దర్శకత్వ బాధ్యత ఎవరి నెత్తిన పెట్టే అవకాశం ఉంది, అసలు ఎప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.

Tags:    

Similar News