బన్నీ 'రాకా' కోసం కాస్ట్లీ గెస్ట్‌...!

'రాకా' సినిమాలో ఏం ఉంటుంది, అసలు ఎవరు ఉంటారు అనే విషయంలో ఏమాత్రం క్లారిటీ రావడం లేదు. చిత్ర యూనిట్‌ సభ్యులు చిన్న లీక్ కూడా ఇవ్వడం లేదు.;

Update: 2026-04-17 07:04 GMT

అల్లు అర్జున్‌ పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారి పోయాడు. అంతకు ముందు ఉన్న లెక్కలన్నింటిని సరి చేసిన పుష్ప సినిమా సరికొత్త నెంబర్స్‌ను క్రియేట్‌ చేసిన విషయం తెల్సిందే. రికార్డ్‌ స్థాయిలో వసూళ్లు సాధించిన పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ కొత్త సినిమా ఇప్పటి వరకు రాలేదు. పుష్ప రేంజ్‌, అంతకు మించి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు అట్లీతో జత కట్టి అల్లు అర్జున్‌ 'రాకా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టైటిల్‌ ఇటీవల బన్నీ బర్త్‌డే సందర్భంగా రివీల్‌ చేశారు. అట్లీ సినిమా గురించి చిన్న క్లూ కూడా ఇవ్వడం లేదు. సాధారణంగా తెలుగు సినిమాలకు సంబంధించిన విషయాలు వారానికి ఒకటి, నెలకు ఒకటి అన్నట్లుగా లీక్‌ అవుతూనే ఉంటాయి. అది ప్రమోషన్ స్టంట్‌ అని కూడా కొందరు అంటారు. కానీ రాకా విషయంలో మాత్రం అలా జరగడం లేదు.

అల్లు అర్జున్‌ రాకా సినిమాలో...

'రాకా' సినిమాలో ఏం ఉంటుంది, అసలు ఎవరు ఉంటారు అనే విషయంలో ఏమాత్రం క్లారిటీ రావడం లేదు. చిత్ర యూనిట్‌ సభ్యులు చిన్న లీక్ కూడా ఇవ్వడం లేదు. ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్‌, హీరోయిన్‌గా దీపికా పదుకునే నటిస్తున్నారు, అట్లీ దర్శకత్వంలో ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ వివరాలు తప్ప మొన్నటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. బన్నీ బర్త్‌డే సందర్భంగా సినిమాకు రాకా అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. పైగా పోస్టర్‌లో బన్నీని సగం మనిషి, సగం మృగం అన్నట్లుగా చూపించి సినిమాపై మరింతగా ఆసక్తి కలిగేలా చేయడం జరిగింది. మొత్తానికి రాకా సినిమా ఏంటీ అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ఇప్పటి వరకు ఇండియన్‌ స్క్రీన్‌ పై చూడని సబ్జెక్ట్‌తో దర్శకుడు అట్లీ రాకా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు అనే నమ్మకం బన్నీ ఫ్యాన్స్‌లో ఉంది.

దీపికా పదుకునే హీరోయిన్‌గా రాకా...

ఈ సినిమాలో దీపికా పదుకునే మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది హీరోయిన్స్ ఉంటారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ షూటింగ్‌లో పాల్గొన్నారు అని కూడా అంటున్నారు. కానీ అది కూడా క్లారిటీ లేదు. అట్లీ సినిమా షూటింగ్‌ మొత్తం ముంబైలో అత్యంత సీక్రెట్‌గా చేస్తున్న కారణంగా షూటింగ్‌లో ఎవరు పాల్గొంటున్నారు, ఎవరు టెక్నీషియన్స్‌ అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌ గెస్ట్‌ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అట్లీతో షారుఖ్‌ కి మంచి సంబంధాలు ఉన్నాయి. వెయ్యి కోట్ల సినిమా ఇచ్చాడు అనే విశ్వాసం అట్లీ పై షారుఖ్‌ కి ఉంది. అందుకే అడిగిన వెంటనే రాకా సినిమాలో షారుఖ్‌ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.

షారుఖ్‌ ఖాన్‌ ను దించబోతున్న అట్లీ...

షారుఖ్‌ ఖాన్‌ ఇటీవల సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, నెల్సన్‌ దిలీప్ కాంబోలో రూపొందుతున్న 'జైలర్‌ 2' సినిమాలో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కేవలం అయిదు రోజుల పాటు షారుఖ్ ఖాన్‌ జైలర్‌ 2 కోసం షూట్‌లో పాల్గొంటాడని, అందుకు గాను షారుఖ్‌ భారీ పారితోషికంను అందుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. జైలర్‌ 2 లో నటించినందుకు భారీ పారితోషికం తీసుకుంటున్న కారణంగా షారుఖ్‌ ఖాన్‌ ను కాస్ట్లీ గెస్ట్‌ అంటూ ఇండస్ట్రీలో పిలుస్తున్నారు. ఇప్పుడు రాకా సినిమా కోసం కూడా షారుఖ్‌ ను అట్లీ రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో కనిపించినందుకు గాను షారుఖ్‌ ఖాన్‌ ఎంత వసూళ్లు చేస్తాడా అనేది చూడాలి. ఇప్పటి వరకు ఈ విషయాల గురించి ఎలాంటి క్లారిటీ లేదు. అయితే రాకాలో షారుఖ్‌ అనగానే అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. బిజినెస్‌ సైతం ఆకాశమే హద్దు అన్నట్లుగా జరగడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News