వెంకీతో త్రివిక్రమ్.. రైల్వేస్టేషన్ లో ప్లాన్ ఏంటి?

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటేనే ఒక వింటేజ్ వైబ్ గుర్తొస్తుంది.;

Update: 2026-04-17 09:05 GMT

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ ఇద్దరి కాంబినేషన్ అంటేనే ఒక వింటేజ్ వైబ్ గుర్తొస్తుంది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకి త్రివిక్రమ్ రాసిన మాటలు వెంకీ టైమింగ్‌లో ఎలా పేలాయో మనందరికీ తెలుసు. అయితే ఈసారి కేవలం రైటర్ గానే కాకుండా, వెంకటేష్ 77వ సినిమాకి త్రివిక్రమ్ డైరెక్షన్ కూడా చేస్తుండటంతో అసలు మ్యాటర్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్ళింది. లేటెస్ట్ గా ‘ఆదర్శ కుటుంబం’ AK47 షూటింగ్ సెట్స్ నుంచి వచ్చిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.




 


ఈ లేటెస్ట్ అప్‌డేట్‌లో ఒక రైల్వేస్టేషన్ సెట్ కనిపిస్తోంది. పక్కనే ట్రైన్ ఉండగా, వెంకీతో త్రివిక్రమ్ ఏదో సీరియస్ గా ముచ్చట్లు పెడుతున్నట్లు ఆ ఫోటోలో ఉంది. ఇది చూస్తుంటే, సినిమాలో రైల్వేస్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఉండబోతోందని అర్థమవుతోంది. త్రివిక్రమ్ సినిమాలో స్టేషన్ సీన్లు అంటేనే ఒక వేల్యూ ఉంటుంది. మరి వెంకీతో ఆయన ఏ రకమైన మ్యాజిక్ ప్లాన్ చేస్తున్నారో చూడాలి.

చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ మళ్ళీ తన మార్కు ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఫోకస్ పెట్టారు. ‘ఆదర్శ కుటుంబం’ అనే పేరు వింటేనే, ఇది పక్కా మధ్యతరగతి ఇంటి కథ అని, అందులో త్రివిక్రమ్ మార్క్ పంచులు, వెంకటేష్ మార్క్ అల్లరి ఉండబోతున్నాయని క్లారిటీ వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో వెంకీ తర్వాతే ఎవరైనా. ఇక త్రివిక్రమ్ కాంటెంట్ క్లిక్కయితే బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులు బద్దలవ్వడం ఖాయం.

ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, హారిక అండ్ హాసిని బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ రైల్వేస్టేషన్ ఫోటోతో సినిమా మూడ్ ఏంటో చెప్పకనే చెప్పేశారు. గతంలో త్రివిక్రమ్ రాసిన సినిమాల్లో వెంకీ తన నటనతో ఒక రేంజ్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏకంగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లోనే పనిచేస్తుండటంతో, మనందరికీ నచ్చిన ఆ ‘ఓల్డ్ వెంకీ మామ’ మళ్ళీ స్క్రీన్ పై కనిపిస్తాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. రైల్వేస్టేషన్ సెట్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్ సినిమాకి చాలా కీలకం అని టాక్. త్రివిక్రమ్ సాధారణంగా సెట్స్‌లో చాలా కూల్‌గా ఉంటూ సీన్లను డెవలప్ చేస్తుంటారు. ఈ ఫోటోలో కూడా ఆ క్రియేటివ్ వైబ్ కనిపిస్తోంది. పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కి ఈ ‘ఆదర్శ కుటుంబం’ ఒక మంచి ట్రీట్ అయ్యేలా ఉంది. ఇక మొదటి టీజర్ ఎప్పుడు వస్తుందో చూడాలి. సినిమాను అయితే ఇదే ఏడాది సమ్మర్ తరువాత విడుదల చేయాలని అనుకుంటున్నారు.

Tags:    

Similar News