సుప్రీంతో సుక్కూ.. 1970లో సాగే మిస్టీరియ‌స్ థ్రిల్ల‌ర్?

Update: 2020-12-04 05:24 GMT
సుప్రీం హీరో సాయి తేజ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు క‌మిట‌వుతూ కెరీర్ ప‌రంగా స్పీడ్ పెంచిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిరోజూ పండ‌గే త‌ర్వాత‌ సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ క్రిస్మ‌స్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రాల త‌ర్వాత అత‌డు మ‌రో రెండు క్రేజీ సినిమాల్లో న‌టిస్తున్నారు. వీటిలో ప్ర‌స్థానం దేవాక‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తుండ‌గా.. ఇప్ప‌టికే ఆ మూవీ ప్రిబిజినెస్ హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌ఖ్యాత జీస్టూడియోస్ సాయి తేజ్ మూవీ ఓవ‌రాల్ రైట్స్ ని భారీ మొత్తానికి చేజిక్కించుకుంద‌న్న స‌మాచారం అందింది.

ప్ర‌స్తుతం సాయి తేజ్ న‌టించే ల్యాండ్ మార్క్ మూవీ ఎస్.టి.డి 15 కి సంబంధించిన మ‌రో ఆస‌క్తిక‌ర వివ‌రం తెలిసింది. ఈ మూవీని అత్తారింటికి దారేది నిర్మాత బీవీఎస్.ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇక ఈ మూవీకి సుకుమార్ స్వ‌యంగా క‌థ‌-స్క్రీన్ ప్లే-డైలాగ్స్ తో టోట‌ల్ స్క్రిప్టును అందిస్తుండ‌డంతో ఒక‌టే ఆస‌క్తి నెల‌కొంది.

సుకుమార్ రైటింగ్స్ ఇప్ప‌టికే స్క్రిప్టును రెడీ చేస్తోంది. ఈ చిత్రం 1970 నేపథ్యంలో మిస్టీరియ‌స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్  అన్న ప్ర‌చారం సాగుతోంది. ఇది రొటీన్ కి భిన్నంగా పూర్తి భిన్నంగా ఉంటుంది. మార్మిక‌త‌తో థ్రిల్లర్ కావడంతో సాయి తేజ్ ఎంతో ఆస‌క్తిగా ఉన్నార‌ట‌.
Tags:    

Similar News