విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ నేపథ్యం అదేనా..?

Update: 2020-12-14 15:30 GMT
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ - స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫాల్కన్‌ క్రియేషన్స్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం.1 గా కేదార్‌ సెలగం శెట్టి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని 2022లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు మేకర్స్ ఇంతకు ముందే ప్రకటించారు. ఇక ఈ మూవీ స్టోరీ గురించి సోషల్ మీడియాలో అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇదొక పీరియాడికల్ మూవీ అని.. ఇండియా - పాకిస్తాన్ విడిపోయిన కాలంలో జరిగిన యుద్ధం నేపథ్యాన్ని తీసుకుని సుక్కు ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించనున్నారని అంటున్నారు. మన దేశం కోసం ఒక సైనికుడు ఎలా పోరాడాడు అనే ఇతివృత్తంలో ఈ సినిమా ఉంటుందట. దీని కోసం విజయ్ బల్క్ డేట్స్ ఇవ్వనున్నాడట.

కాగా ప్రస్తుతం సుకుమార్ మరియు విజయ్ దేవరకొండ ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు. సుకుమార్ అల్లు అర్జున్ తో 'పుష్ప' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. 'రంగస్థలం' వంటి సూపర్ హిట్ తర్వాత సుక్కు డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో 'పుష్ప' పై మంచి అంచనాలే ఉన్నాయి. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఓ షెడ్యూల్ పూర్తయింది. కోవిడ్ నేపథ్యంలో నిలిచిపోయిన చిత్రీకరణ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా ప్లాప్ అవడంతో వీడీ ఫ్యాన్స్ ఈ సినిమాపై మంచి అంచనాలే పెట్టుకున్నాడు.
Tags:    

Similar News