వేటకు సిద్ధమైన 'మన శంకరవరప్రసాద్ గారు'
ఫార్మల్ సూట్ వేసుకుని, చేతిలో పెద్ద గన్ పట్టుకుని ఏదో టార్గెట్ వైపు వెళ్తున్నట్లు ఉన్న చిరంజీవి స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.;
సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు' (MSG) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్, లేటెస్ట్ గా ఓవర్సీస్ ప్రేక్షకులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. అమెరికాలో ఈ సినిమా బుకింగ్స్ ను అధికారికంగా ఓపెన్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమా యుఎస్ ప్రీమియర్స్ జనవరి 11న చాలా గ్రాండ్ గా జరగనున్నాయి. సంక్రాంతి పండుగకు ముందే బాక్సాఫీస్ జాతర మొదలుపెట్టాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. సరిగ్గా పండగ మూడ్ ని సెట్ చేసేలా ఈ ప్రీమియర్స్ ను ప్లాన్ చేశారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సరిగామ సినిమాస్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది.
లేటెస్ట్ గా వదిలిన పోస్టర్ లో చిరు లుక్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఫార్మల్ సూట్ వేసుకుని, చేతిలో పెద్ద గన్ పట్టుకుని ఏదో టార్గెట్ వైపు వెళ్తున్నట్లు ఉన్న చిరంజీవి స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "మన శంకరవరప్రసాద్ గారు.. పండగకి వస్తున్నారు" అంటూ పోస్టర్ పై ఉన్న క్యాప్షన్ సినిమాపై నమ్మకాన్ని మరింత పెంచుతోంది.
అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి మాస్ ఇమేజ్, కామెడీ టైమింగ్ కలిస్తే అవుట్ పుట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరు నుంచి వస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆల్బమ్ ఇప్పటికే మాస్ ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది. ఇప్పుడు ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో రికార్డుల వేట మొదలైనట్లే. జనవరి 11న ప్రీమియర్స్ తోనే సినిమా రేంజ్ ఏంటో తెలిసిపోతుంది. మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఈసారి సంక్రాంతి పోరు రసవత్తరంగా మారింది. తనదైన స్టైల్, స్వాగ్ తో చిరు మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అయ్యారు. చూడాలి మరి, ఈ 'మన శంకరవరప్రసాద్ గారు' సంక్రాంతి విన్నర్ గా నిలిచి ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో.