నేనైతే మారుతి రైటింగ్ కి ఫ్యాన్ అయిపోయాను!- ప్రభాస్
క్లైమాక్స్ అద్భుతం. చాలా కొత్త పాయింట్ తో తీసాడు.. హారర్ కాన్సెప్టుల్లోనే అదో వైవిధ్యమైన ప్రయత్నం. ఏదేమైనా నాకు 15 ఏళ్ల తర్వాత ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చాడు.;
డార్లింగ్ ప్రభాస్ వరుసగా యాక్షన్ సినిమాల్లో నటిస్తున్న సమయంలో మారుతి హారర్ కామెడీతో అతడికి కొత్త దారి చూపించిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా `ది రాజా సాబ్` థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమా హారర్ కాన్సెప్టుల్లో ఇంతవరకూ రాని పాయింట్ తో వస్తుందని తెలిపారు.
ప్రభాస్ మాట్లాడుతూ.. ``మూడు సంవత్సరాల స్ట్రెస్, పెయిన్, బాధ్యత ఇవన్నీ మా సినిమాకి కలిసొచ్చాయి.. మారుతి చాలా శ్రమించాడు. మొదట దర్శకుడు మారుతి నేను మన ఫ్యాన్స్ కి చాలా సంవత్సరాల తర్వాత కొత్తగా ఏదైనా ఇవ్వాలని అనుకున్నాం. అన్నీ డిష్యుం డిష్యుం సినిమాలే.. ఎంటర్ టైన్ చేయాలి అన్నాను. చివరికి హారర్ కామెడీ తో మా ప్రయాణం మొదలైంది. ఈ సినిమాతో చాలా హాస్యం, వినోదం అందిస్తాను. నిజానికి ఈ కథ ఒక ఫేస్ కి వెళ్లేప్పటికి క్లైమాక్స్ ఊహించనంత మలుపు తిరుగుతుంది.. నేనైతే మారుతి రైటింగ్ కి ఫ్యాన్ అయిపోయాను!
క్లైమాక్స్ అద్భుతం. చాలా కొత్త పాయింట్ తో తీసాడు.. హారర్ కాన్సెప్టుల్లోనే అదో వైవిధ్యమైన ప్రయత్నం. ఏదేమైనా నాకు 15 ఏళ్ల తర్వాత ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చాడు. ఈ చిత్రం సంక్రాంతికి వస్తోంది`` అని తెలిపారు. సంక్రాంతి సినిమాల్లో అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. చాలా ముఖ్యంగా గమనించాల్సినది... సీనియర్స్ (చిరంజీవి, రవితేజ సినిమాలొస్తున్నాయి) నుంచి నేర్చుకున్నదే. సీనియర్స్ సక్సెసవ్వాలి. మేము కూడా విజయం సాధించాలని కూడా ప్రభాస్ ఆకాంక్షించారు.
ఇక ఉత్తరాదిన ది రాజా సాబ్ చిత్రాన్ని విడుదల చేస్తున్న అనీల్ తడానీ గురించి వేదికపై ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. ``అనీల్ తడానీ .. నా బ్రదర్.. నా సినిమాలన్నిటికీ ఆయనే వెన్నెముక. ది రాజా సాబ్ ని రిలీజ్ చేస్తున్నారు`` అని తెలిపారు. ఈ చిత్రంలో నటించిన అందాల కథానాయికలు మనసుల్ని గెలుచుకుంటారు.
సంజయ్ దత్ సర్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలు. క్లోజప్ పెడితే చాలు.. అద్బుతంగా నటిస్తారు. ఇందులో నాన్నమ్మ పాత్రధారి బాగా కుదిరారు. ఇది నానమ్మ- మనవడు కథ.. ఈ సినిమాకి హీరో విశ్వప్రసాద్ గారు. బడ్జెట్ విషయంలో రాజీకి రాకుండా నిర్మించారు. మూడు సంవత్సరాలకు పూర్తయింది. బడ్జెట్ మేం అనుకున్నది వేరు. కానీ ఎక్కడికో వెళ్లింది. నిజానికి మేం భయపడ్డాం కానీ... ఈయన అస్సలు భయపడరు. రాజా సాబ్ కి హీరో విశ్వప్రసాద్ గారు.
థమన్ .. మాత్రమే ఆర్.ఆర్ చేయగలడు అనుకున్నాం.. అతడు అద్బుతమైన పనిని అందిస్తున్నాడు. డివోపి కార్తీక్.. నాణ్యమైన విజువల్స్ ని అందించారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, సోల్మన్ మాస్టర్స్ అద్భుతమైన ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసారు`` అని ప్రభాస్ తెలిపారు. కార్యక్రమంలో మారుతి, విశ్వప్రసాద్, ఎస్కే ఎన్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ తదితరులు పాల్గొన్నారు.