సుకుమార్‌ కు డైరక్టర్లు దొరకట్లేదా?

Update: 2016-05-02 11:30 GMT
'సుకుమార్‌ రైటింగ్స్‌' అనే ఒక బ్యానర్‌ స్థాపించి.. ఆ బ్యానర్‌ పై ప్రొడ్యూస్‌ చేసిన తొలి సినిమాకు తనే కథను అందించాడు సుకుమార్‌. అదే ''కుమార్‌ 21 ఎఫ్‌'' . అయితే ఈ సినిమా సక్సెస్‌ కు కారణం ఏంటంటే.. సుకుమార్‌.. రత్నవేలు.. దేవిశ్రీప్రసాద్‌ అనే మూడు పిల్లర్స్‌ అంటూ ప్రచారం సాగింది. కాని సినిమా రిలీజ్‌ అయ్యాక.. క్రెడిట్ అంతా హెబ్బా పటేల్‌ పట్టేసిందిలే. కాకపోతే దర్శకుడు సూర్య ప్రతాప్‌ పల్నాటి గురించి అసలు ప్రస్థావించిన వారే తక్కువ.

ఒక కథను ఒక రైటర్‌ ఎంత అద్భుతంగా రాసినా కూడా.. దానిని తెరకెక్కించిన డైరక్టర్‌ కారణంగానే ఇంపాక్ట్‌ అనేది క్రియేట్‌ అవుతుంది. అటువంటిది అసలు సూర్య ప్రతాప్‌ గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడకుండా.. కేవలం సుకుమారే దేవుడు అంటూ ప్రచారం చేయడంతో.. ఇప్పుడు సుకుమార్‌ కు చిక్కొచ్చిపడింది. నిజానికి మనోడు తన రెండో ప్రొడక్షన్‌ వెంచర్‌ గా నాగ శౌర్యతో ఒక సినిమాను తీయడానికి అంతా రెడీ చేస్తున్నాడు. అయితే సుకుమార్ శిష్య గణంలోనే ఈ సినిమాను డైరక్టు చేయడానికి ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపించట్లేదట.

ఏముంది.. సినిమా ఎంత బాగా తీసినా కూడా.. రత్నవేలు కెమెరా అదిరింది.. డిఎస్‌ పి మ్యూజిక్‌ చింపింది.. సుకుమార్‌ కథ కేక అనే రిమార్కులే తప్పించి.. దర్శకుడికి ప్రయారిటీ ఇస్తూ ప్రమోషన్లు జరిగే ఛాన్సు కూడా ఉండదు. అలాంటప్పుడు అంత రిస్క్ తీసుకొని సుకుమార్‌ ప్రొడక్షన్‌ లో డైరక్షన్‌ చేయడానికి ఎవరు ముందుకొస్తారు? గత మూడు నెలలుగా సుక్కూ ఒక నూతన దర్శకుడి కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మరి.
Tags:    

Similar News