ఆ బ్యాన‌ర్లో మెగాస్టార్ సినిమా!!

Update: 2018-04-11 11:21 GMT
మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం ‘సైరా’ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పోరాట యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్రలో చిరూ క‌నిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌ ఇంకా ఓ కొలిక్కి రాక‌ముందే అప్పుడు మెగాస్టార్ న‌టించ‌బోయే త‌ర్వాతి సినిమా గురించి ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ నిర్మాణంలో కొణిదెల ప్రొడక్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై రూపొందుతోంది ‘సైరా’. ఈ సినిమా కోసం దాదాపు 150 నుంచి 200 కోట్ల దాకా బ‌డ్జెట్ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ త‌ర్వాత చిరంజీవి మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ఇప్ప‌ట‌కీ ‘శ్రీ‌మంతుడు’- ‘జ‌న‌తా గ్యారేజ్‌’- ‘రంగ‌స్థ‌లం’ సినిమాలు వ‌చ్చాయి. ఈ మూడూ కూడా సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లే. శ్రీ‌మంతుడు సినిమా నాన్‌- బాహుబ‌లి ఇండ‌స్ట్రీ హిట్టు సాధిస్తే... జ‌న‌తా గ్యారేజ్ ఎన్‌.టీ.ఆర్ కెరీర్లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక రామ్ చ‌ర‌ణ్ ‘రంగ‌స్థ‌లం’ సృష్టించిన క‌లెక్ష‌న్ల సునామీ గురించి తెలిసిందే. ఈ బ్యాన‌ర్లో నెక్స్ట్ నాగ‌చైత‌న్య‌- చందూ మొండేటి కాంబినేష‌న్లో ‘స‌వ్య‌సాచి’ రాబోతోంది.

‘రంగ‌స్థ‌లం’ సినిమా స‌మ‌యంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ ప‌నితీరు ప‌ట్ల చాలా సౌక‌ర్యంగా ఫీల‌య్యిన చెర్రీ... తండ్రికి ఆ విష‌యం చెప్పి త‌ర్వాతి సినిమా ఈ బ్యాన‌ర్లోనే చేయాల‌ని చెప్పాడ‌ని స‌మాచారం. దీనికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. అయితే చిరూతో సినిమా చేయ‌ట్లేద‌ని చెప్పాడు సుక్కూ. కానీ ‘రంగ‌స్థ‌లం’ సినిమా ఫ‌లితం చూసి మెగాస్టార్... సుక్కూ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల‌ని ఇష్ట‌ప‌డుతున్నాడ‌ని... త్వ‌ర‌లో సినిమా అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని ఫిల్మ్ న‌గర్ వ‌ర్గాల స‌మాచారం.
Tags:    

Similar News