సుకుమార్ కు, ప్రేక్షకుల మధ్య ఆ గ్యాప్ ఏంటి?

Update: 2016-02-17 10:55 GMT
 సుకుమార్ సినిమాలంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఉన్నారు... అలాంటిది తనకు, సినీ ప్రేక్షకులకు మధ్య చాలా గ్యాప్ ఉంది అంటాడు సుకుమార్. అందుకే తన సినిమాలు చూడగానే జనాలకు ఎక్కడం లేదని..... మెల్లగా ఎక్కుతున్నాయని అంటున్నాడు. అందుకే తన ప్రతి సినిమాకు డివైడ్ టాక్ వస్తోందని.. అది తనను టెన్షన్ పెట్టేస్తోందని సుకుమార్ చెబుతున్నాడు.

తన కెరీర్లో ఆర్య - 100 పర్సంట్‌ లవ్‌ సినిమాలకు మినహాయించి ప్రతి సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చిందని.. లేటెస్టుగా 'నాన్నకు ప్రేమతో' సినిమాకు కూడా డివైడ్‌ టాక్‌ రావడంతో చాలా టెన్షన్‌ పడ్డానని సుక్కు చెబుతున్నాడు. అయితే... డివైడ్ టాక్ రావడానికి గల కారణాలను కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ''ప్రేక్షకులకు, తనకు మధ్య ఏదో గ్యాప్ ఉందని... ప్రేక్షకులకు ఏమాత్రం క్లూ ఇవ్వకపోవడమే దీనికి కారణం అనుకుంటున్నానని చెప్పాడు. వాళ్లేదో ఊహించుకుని సినిమాకు వస్తున్నారు. తెర మీద నేనేదో చూపిస్తున్నా. వాళ్లు కోరుకున్నట్లు సినిమా లేకపోవడంతో నిరాశ చెందుతున్నట్లున్నారు. అందుకే మొదట డివైడ్‌ టాక్‌ వస్తోంది. ఆ తర్వాత సినిమా ఏంటన్నది అర్థం చేసుకుని ఆదరిస్తున్నారు అని విశ్లేషించాడు సుక్కు.

తాను కథ చెప్పే విధానం... రచన అంతా వేరేగా ఉంటుందని... ప్రేక్షకులకు కొత్తగా ఏదో చెప్పాలని అనుకుంటానని... వాళ్లు తెలివైన వాళ్లన్న భావనతో అలా సినిమాలు తీస్తానని సుకుమార్ అంటున్నారు. అంటే తన రేంజిలో ప్రేక్షకులు లేరనా... లేదంటే వారు తెలివి తక్కువ వారనా?  అర్థం.. అంతరార్థం సుకుమారే చెప్పాలి.

Tags:    

Similar News