సుక్కూ మరో రెండు సినిమాలే డైరెక్ట్ చేస్తాడట

Update: 2016-01-22 08:51 GMT
ఇది నిజంగా బాధకలిగించే వార్తే. మూసలో, మాసులో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాను తనదైన క్రియేటివ్ బ్రెయిన్ తో కొత్త పంధాని అనుసరిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న లెక్కల మాస్టర్ మరో రెండు సినిమాలు తీసి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ కి రిటైర్ మెంట్ ప్రకటించనున్నాడట. సోషల్ నెట్ వర్క్ లో ఈ వార్త తెలిసిన వెంటనే అతని అభిమానుల గుండెల్లో భారీ బండపడింది.

ఆర్య - జగడం - ఆర్య 2 - 100% లవ్ - నేనొక్కడినే - నాన్నకు ప్రేమతో వంటి సినిమాలలో తనదైన బలమైన ముద్రవేసిన సుకుమార్ ఇంత త్వరగా ఈ నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అయితే దర్శకుడిగా రిటైర్ అయినా రచయితగా, నిర్మాతగా సినీపరిశ్రమకు సేవలు అందించే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.

ఇక మిగిలింది మరో రెండు సినిమాలే గనుక అందులో ఒకటి దేవిశ్రీప్రసాద్ తో రొమాంటిక్ స్టోరీ అని ఫిక్స్ అయ్యింది గనుక సుక్కూ ఆఖరి సినిమా ఎవరితో వుంటుందో అన్నదే ఇప్పుడు అందరి ఆలోచన. పవన్ - బన్నీ- మహేష్ ల పేర్లు ఎవరికీ నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి సుక్కూ మనసులో ఎవరున్నారో..
Tags:    

Similar News