• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రామ్ చరణ్...

రామ్ చరణ్ మట్టిమనిషి-సుకుమార్

By - Tupaki Desk
Update: 2017-07-16 04:20 GMT
తన మిత్రుల గురించి.. తన హీరోల గురించి.. తన టెక్నీషియన్ల గురించి  ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటాడు సుకుమార్. తన నిర్మాణంలో తెరకెక్కిన ‘దర్శకుడు’ ఆడియో వేడుకలోనూ సుక్కు ప్రసంగం చాలా ఆసక్తికరంగా సాగింది. తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’లో హీరోగా నటిస్తున్న రామ్ చరణ్ గురించి.. అలాగే ‘దర్శకుడు’తో దర్శకుడిగా పరిచయం కానున్న తన మిత్రుడు హరి ప్రసాద్ జక్కా గురించి సుకుమార్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. దర్శకుడు ఆడియో వేడుకలో ఆయన ఏమన్నాడంటే..

‘రంగస్థలం’ సినిమా చేసే ముందు రామ్ చరణ్ మెగాస్టార్ కొడుకు కదా.. బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ కదా.. ఇతడితో ఎలా డీల్ చేయాలా అనుకున్నాను. కానీ అతను మనం అనుకున్న రకం కాదు. అతనో మట్టి మనిషి. కాఫీలో బెల్లం కలుపుకుని తాగే బాబు. పాపికొండలు షూటింగుకి వెళ్లినపుడు మేమందరం ట్యూన్  అయిపోయాం. మేమంతా సన్ స్క్రీన్ రాసుకుంటే అతను మాత్రం పులిసిన పెరుగులో సున్నిపిండి కలుపుకుని రాసుకునే బాబు. చాలా సహజంగా ఉంటాడు. ఒదిగి ఉంటాడు. మనం దూరం నుంచి చూసి మనం ఈ క్రీమ్ వాడతాం.. ఈ సెంట్ వాడతాం.. ఈ పేస్ట్ వాడతాం. అతనేం వాడతాడో అనుకుంటాం. కానీ చరణ్ వేప పుల్లతో పళ్లు తోముకునే బాబు.

ఇక హరిప్రసాద్ విషయానికి వస్తే అతను నాకు ఆప్తమిత్రుడు. నేను కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్ గా ఉన్నపుడు అతను అక్కడ ఫిజిక్స్ చెప్పేవాడు. చాలా షార్ప్. అతను నాకు గూగుల్ లాంటి వాడు. అతను నా హార్డ్ డిస్క్ అని కూడా చెప్పొచ్చు. ఏమడిగినా చెప్పేవాడు. అద్భుతమైన మెమొరీ అతడి సొంతం. నేను సినిమా రంగంలోకి వచ్చాక అతను కూడా ఇక్కడికి వచ్చేశాడు. నేను కెరీర్లో చాలా స్ట్రగుల్ అవుతున్నపుడు నాకు అండగా నిలిచాడు. నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చాడు. ‘1 నేనొక్కడినే’కు కథ ఇవ్వడమే కాదు.. నా చాలా కథలకు సాయం చేశాడు. అతను ఏ సినిమాకూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదు. అయినా ‘దర్శకుడు’ సినిమాను చాలా బాగా తీశాడు. ఈ కథ చెప్పగానే.. నువ్వే డైరెక్ట్ చెయ్యి అన్నాను. చేసేశాడు’’ అని సుకుమార్ చెప్పాడు.
Tags:    
  • Sukumar 
  • Ram Charan 
  • Darshakudu Audio launch 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS