మహేష్ తో మూవీ గురించి సుక్కు మాట

Update: 2018-05-10 07:13 GMT
 ఈ ఏడాది మొత్తానికి ఇప్పటి దాకా టాప్ చైర్ అందుకున్న ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ రంగస్థలం దర్శకుడిగా సుకుమార్ ఆనందం మామూలుగా లేదు. ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే తో సామాన్యులకు అంత ఈజీగా అర్థం కాని సినిమాలు తీస్తాడని పేరున్న సుక్కు తన శైలికి భిన్నంగా తనను వద్దనే మాస్ ప్రేక్షకులే బ్రహ్మరధం పట్టేలా రంగస్థలంని తీర్చిదిద్దిన తీరు ఇప్పుడొచ్చిన ప్రశంశలతో పాటు భవిష్యత్తులో అవార్డులు కూడా తెచ్చేలా ఉంది. 50 రోజుల ప్రస్థానాన్ని త్వరలో పూర్తి చేసుకోకున్న రంగస్థలం విజయంలో సుకుమార్ పాత్ర అసామాన్యమైనది. ఇప్పుడు సుకుమార్ తర్వాత చేయబోయే సినిమా మీదే అందరి దృష్టి ఉంది. మహేష్ బాబు తో రంగస్థలం నిర్మాతలు మైత్రి బ్యానర్ లోనే తన సినిమా ఉంటుందని సుకుమార్ అధికారికంగా ప్రకటించిన నేపధ్యంలో ఈసారి బ్యాక్ డ్రాప్ ఏది ఎంచుకుంటాడా అనే ఆసక్తి అందరిలో ఉంది.

నిజానికి సుకుమార్ కు ఇది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మహేష్ తో గతంలో తను చేసిన 1 నేనొక్కడినే టెక్నికల్ గా ఎంత పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా అది డిజాస్టర్ కిందే లెక్క. ఆ కసి అతనిలో ఉంది. ఈ మధ్యే ఒక ప్రెస్ మీట్ లో వన్ ఫెయిల్యూర్ కి తనదే బాధ్యతని ప్రేక్షకులు అర్థం చేసుకునేలా కథను చెప్పలేదంటే అది తన తప్పు అవుతుంది కాని వాళ్ళది కాదని చెప్పి వినయంగా ఒప్పేసుకున్నాడు. సో ఇప్పుడు ఋజువు చేసుకునే ఛాన్స్ మరోసారి వచ్చింది. రెస్ట్ కోసం తన స్వంత ఊరిలో కాలక్షేపం చేస్తున్న సుకుమార్ అక్కడి వారితో రంగస్థలం తరహాలోనే మహేష్ సినిమా కూడా ఎవరూ ఊహించని జానర్ లో ఉంటుందని చెప్పాడట. కాకపోతే స్టొరీ లైన్ మాత్రమే అనుకున్నామని ఇంకా డెవలప్ చేయాల్సి ఉందని చెప్పడం ఫైనల్ ట్విస్ట్.

మహేష్ ఇంకా వంశీ పైడిపల్లి రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కాలేదు. ఎప్పటి నుంచి అనే క్లారిటీ మరో కొద్ది రోజుల్లో రావొచ్చు. ఇది పూర్తయ్యే లోపు సుకుమార్ కంప్లీట్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉండేలా ప్లానింగ్ జరుగుతోంది. రామ్ చరణ్ కు ఇచ్చినట్టే మహేష్ కు కూడా బాక్స్ ఆఫీస్ మారుమ్రోగిపోయే హిట్ ఇవ్వాలని మహేష్ ఫాన్స్ కోరుతున్నారు. తన బలం ఏంటో సుకుమార్ కు తెలిసిపోయింది కాబట్టి ఈ సారి ఆ నమ్మకం నిలబడే అవకాశాలే ఎక్కువ.
Tags:    

Similar News