మహేష్ 26 - ప్రభాస్ 21 సుక్కూతో
`రంగస్థలం` చిత్రం తర్వాత సుదీర్ఘ విరామమే తీసుకున్నాడు సుకుమార్. ప్రస్తుతం మహేష్ 26 కోసం కథ రెడీ చేస్తున్నాడు. స్క్రిప్టు రూపకల్పన కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. మహేష్ `మహర్షి` చిత్రీకరణ పూర్తి చేసుకునే సమయానికి పూర్తి స్థాయి స్క్రిప్టుతో సుకుమార్ సిద్ధంగా ఉండాలన్నది కండిషన్. ఆ ప్రకారమే సుకుమార్ ఇప్పటికే కథ విషయమై చాలానే వర్క్ చేశాడు. నిన్నటిరోజున మైత్రి మూవీ మేకర్స్ మరోసారి మహేష్- సుకుమార్ ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సుక్కూ గురించి ఓ ఆసక్తికర చర్చ సాగింది.
నాన్నకు ప్రేమతో - రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్ని అందించిన సుకుమార్ ఈసారి మహేష్ - ప్రభాస్ ల కోసం కథలు రెడీ చేస్తూ బిజీగా ఉన్నాడు. మహేష్ కథ రెడీ అవుతుండగానే - అసిస్టెంట్లకు లైన్ వినిపించి ప్రభాస్ కోసం పూర్తిగా డెవలప్ చేయిస్తున్నాడట. ఫైనల్ గా సుక్కూ విజన్ - వెరిఫికేషన్ తో ఆ స్క్రిప్టు కూడా ఫైనల్ అవుతుందని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ - మైత్రి మూవీ సుక్కూతో ఉంటుంది. ఆ తర్వాత యు.వి.క్రియేషన్స్ లోనే ప్రభాస్ - సుకుమార్ సినిమా ఉంటుందా? లేదూ వేరొక బ్యానర్ లోనా? అన్నది మాత్రం తెలియాల్సి ఉందింకా. ప్రస్తుతానికి సుకుమార్ కి ప్రభాస్ తో కమిట్ మెంట్ మాత్రం ఉందని తెలుస్తోంది.
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం యువి సంస్థలోనే `సాహో` - ప్రభాస్ 20 చిత్రాలు చేస్తున్నాడు. తదుపరి 21వ సినిమా సుకుమార్ తో ఉంటుంది. జిల్ రాధాకృష్ణతో చేస్తున్న ప్రేమకథా చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి - తదుపరి సుకుమార్ తో డిస్కషన్స్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ప్రభాస్ సినిమాలు రెండూ పూర్తయ్యేప్పటికి కొత్త స్క్రిప్టుతో సుకుమార్ రెడీ అవుతాడన్నమాట. ఎన్టీఆర్ - చరణ్... ఆ వెంటనే మహేష్ - ప్రభాస్ లతో సినిమాలు చేస్తున్న ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ తదుపరి అల్లు అర్జున్ - అఖిల్ లాంటి హీరోలతోనూ సినిమాలు చేయనున్నారన్న సమాచారం ఉంది.