• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎక్స్‌క్లూజివ్‌: 'Rx100'...

ఎక్స్‌క్లూజివ్‌: 'Rx100' హీరోతో సుకుమార్ సినిమా..!

By - Tupaki Desk
Update: 2021-03-11 10:45 GMT
ప్రముఖ దర్శకుడు సుకుమార్ ప్రొడ్యూసర్ గా మారి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సినిమాలు కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జీఏ 2 పిక్చర్స్ బన్నీ వాసుతో కలిసి సుకుమార్ '18 పేజెస్' అనే సినిమా రూపొందిస్తున్నాడు. నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి సుకుమార్ రైటింగ్స్ - జీఏ 2 పిక్చర్స్ సంస్థలు కలసి ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

'Rx100' ఫేమ్ కార్తికేయ హీరోగా జీఏ 2 పిక్చ‌ర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బన్నీ వాస్ - సుకుమార్ కలిసి ఓ సినిమా చేయనున్నారట. దీనికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. యువ హీరో కార్తికేయ ఆల్రెడీ జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యానర్ లో 'చావు కబురు చల్లగా' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు పెగళ్ళపాటి కౌశిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కార్తికేయతో మరో సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్న బన్నీ వాస్.. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని న‌వంబ‌ర్ నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:    
  • Sukumar 
  • Rx100 hero 
  • Shiva Karthikeyan 
  • G2 Pictures 
  • Tollywood 
  • Telugu News 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS