సన్నిహితుల వద్ద సుకుమార్ ఆవేదన

Update: 2019-05-05 04:29 GMT
‘మహర్షి’ సినిమాలో తాను నటించడం కోసం వంశీ పైడిపల్లి రెండేళ్లు ఎదురు చూశాడని.. కానీ కొందరు దర్శకులు రెండు నెలలు కూడా ఎదురు చూడలేక కథ పట్టుకుని వేరే హీరో దగ్గరికి వెళ్లిపోతున్నారని ఆ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు సుకుమార్‌ ను ఉద్దేశించినవే అని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. సుక్కు మహేష్‌ ను అంతగా హర్ట్ చేశాడా.. మరీ ఈ రేంజిలో సుక్కుకు మహేష్ పంచ్ వేయాలా అన్న చర్చ జరిగింది.

ఐతే ఈ వ్యాఖ్యల వెనుక మహేష్ ఉద్దేశం ఏమిటో కానీ.. సుకుమార్ మాత్రం వీటి వల్ల మనస్తాపానికి గురైనట్లు సమాచారం. సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. మహేష్ కోసం తాను ఎదురు చూసింది రెండు నెలలు కాదని.. దాదాపు ఏడాది అని సుక్కు అన్నాడట. అందులో స్క్రిప్టు పని కోసం సమయం పట్టినప్పటికీ.. మహేష్ కూడా అందుబాటులోకి రావడానికి ఆలస్యం జరిగిందన్నది సుక్కు మాట. ఇక సినిమా మొదలుపెడదాం అనే సమయానికి అనిల్ సినిమాను మహేష్ ముందుకు తెచ్చాడని - అదయ్యాక తనతో సినిమా చేస్తానని చెప్పాడని సుక్కు అంటున్నాడట.

అలా కాకుండా అనిల్ సినిమాను, తన సినిమాను ఒకేసారి చేస్తా అనగా.. లుక్ విషయంలో చాలా పర్టికులర్‌ గా ఉండాల్సిన నేపథ్యంలో అలా కుదరదని చెప్పి తాను ఈ సినిమాను రద్దు చేసుకునే ప్రపోజల్ ముందు పెట్టానని.. మహేష్ కూడా ఓకే అన్నాడని.. మ్యూచువల్ అండర్ స్టాండింగ్‌ తోనే సినిమాను క్యాన్సిల్ చేసుకోగా మహేష్ వేరే ఉద్దేశంతో తనపై సెటైర్ వేయడం ఏంటని సుక్కు ఆవేదన చెందాడట. ఐతే తాజాగా మీడియాను కలిసిన మహేష్.. ప్రి రిలీజ్ ఈవెంట్ వ్యాఖ్యల్లో వేరే ఉద్దేశం లేదంటూ సుకుమార్ గురించి - 1 నేనొక్కడినే సినిమా గురించి చాలా పాజిటివ్‌ గా మాట్లాడటంతో సుక్కు కొంచెం తేలికపడ్డట్లు తెలిసింది.


Tags:    

Similar News