బ్లూ అండ్ వైట్ క్వీన్ పాయల్ విరహం
అజయ్ భూపతి `ఆర్.ఎక్స్ 100` పాయల్ కి గ్రాండ్ ఎంట్రీని ఇచ్చింది. చాలా మంది కథానాయికలకు లేని అదృష్టమిది.;
అజయ్ భూపతి `ఆర్.ఎక్స్ 100` పాయల్ కి గ్రాండ్ ఎంట్రీని ఇచ్చింది. చాలా మంది కథానాయికలకు లేని అదృష్టమిది. కానీ ఎందుకనో పాయల్ రాజ్ పుత్ దానిని పెద్ద స్థాయికి తీసుకుని వెళ్లడంలో సఫలం కాలేకపోయింది. కెరీర్ ఆరంభం కొన్ని డీగ్రేడ్ చిన్న సినిమాలకు సంతకాలు చేయడంతో అది పాయల్ కి మైనస్ అయింది.
మధ్యలో తన గురువు అజయ్ భూపతి మంగళవారం అనే చిత్రంలో అవకాశం కల్పించినా అది కూడా కలిసి రాలేదు. ఓవైపు పంజాబీ చిత్రాల్లో నటిస్తూనే ఇటు సౌత్ లో అగ్ర నాయికగా ఎదగాలని తపించింది పాయల్. కానీ, సౌత్ లో తన సెక్యూరిటీ కోసం ప్రియుడు గౌరవ్ ధింగ్రాతో వరుస ఫోటోషూట్లు చేసి సోషల్ మీడియాల్లో ఓపెనైంది. దక్షిణాదిన పాయల్ వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకున్నా ఆశించిన విజయం అందుకోలేదు. ఆర్.బి. చౌదరి కుమారుడు రంగం ఫేం జీవా సరసన గోల్ మాల్ అనే తమిళ చిత్రంలోను నటించింది. కానీ ఇది ఆశించిన విధంగా రిలీజ్ కి రాకపోవడం పెద్ద నిరాశ. అలా తెలుగు, తమిళం రెండు చోట్లా పాయల్ గేమ్ ఆశించిన విధంగా కుదరలేదు.
ఇటీవల కొన్ని వరుస ఫోటోషూట్లతో ఈ బ్యూటీ చెలరేగిపోతోంది. ఇప్పుడు ఇలా బ్లూ టాప్, బిస్కెట్ కలర్ బాటమ్ తో అదిరిపోయే ఫోజులిచ్చింది. పాయల్ ఎంతో డీసెంట్ గా కనిపిస్తూనే, తనలోని బోల్డ్ యాంగిల్ ని కూడా ఎలివేట్ చేస్తూ యువతరం దృష్టిని తనవైపునకు తిప్పేసుకుంది.
పాయల్ కి మరో ఆర్.ఎక్స్ 100 రేంజ్ హిట్టు కావాలి. కానీ ఆశించిన అవకాశం తనవెంట రావడం లేదు. చాలా కాలంగా ఏంజెల్, కిరాతక అనే చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కానీ ఇవేవీ ఇప్పట్లో రిలీజ్ కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పాయల్ తదుపరి చిత్రం ఏమిటి? అన్నదానికి సరైన జవాబు లేదు. ఇప్పటికి ఇలా వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాల్లో ఫ్యాన్స్ కి ట్రీటివ్వడంలో పాయల్ బిజీగా ఉంది.