దృశ్యం 3లో కొత్త పాత్ర.. అక్షయ్ ప్లేస్ లో ఎవరతను..?

ఇప్పటికే అజయ్ దేవగన్ తన టీం తో పార్ట్ 3 కథ రాయించేశాడట. జీతూ జోసెఫ్ దగ్గర కూడా ఆమోదం పొందారని టాక్. ఐతే ఒక సీక్వెల్ సినిమాకు రెండు వేరు వేరు కథలతో సినిమాలు తీయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.;

Update: 2025-12-27 06:00 GMT

జీతూ జోసెఫ్ దృశ్యం ఫ్రాంచైజీల్లో 3వ పార్ట్ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. మోహన్ లాల్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న దృశ్యం 3 సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే బాలీవుడ్ లో కూడా అజయ్ దేవగన్ తో ఈ సినిమా మొదలు పెట్టాలని ప్లాన్ చేయగా అది కుదరలేదు. ఐతే దృశ్యం 3 కథను హిందీ వెర్షన్ లో మార్చేస్తున్నారని టాక్. ఇప్పటికే అజయ్ దేవగన్ తన టీం తో పార్ట్ 3 కథ రాయించేశాడట. జీతూ జోసెఫ్ దగ్గర కూడా ఆమోదం పొందారని టాక్. ఐతే ఒక సీక్వెల్ సినిమాకు రెండు వేరు వేరు కథలతో సినిమాలు తీయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.

పాతాల్ లోక్ వెబ్ సీరీస్ తో జైదీప్ అహ్లావత్..

ఇదిలా ఉంటే దృశ్యం 3 హిందీ సినిమాలో అక్షయ్ ఖన్నా రోల్ ని మార్చేస్తున్నారట. ఆ పాత్రకు అక్షయ్ ఖన్నాకు బదులుగా జైదీప్ అహ్లావత్ ని తీసుకుంటున్నారట. పాతాల్ లోక్ వెబ్ సీరీస్ తో సూపర్ పాపులర్ అయిన జైదీప్ అహ్లావత్ ఇప్పుడు వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఆల్రెడీ అతను ఫ్యామిలీ మ్యాన్ 3 లో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఫ్యామిలీ మ్యాన్ 3లో జైదీప్ సర్ ప్రైజ్ చేశాడు.

ఇక ఇప్పుడు దృశ్యం థర్డ్ ఫ్రాంచైజీలో కూడా అక్షయ్ ఖన్నా రోల్ లో నటిస్తున్నాడు. ఐతే అక్షయ్ ఖన్నా ఈమధ్య దురంధర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. సినిమాలో అతని పాత్ర సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. అక్షయ్ ఖన్నా ఎక్స్ పీరియన్స్ అంతా కూడా ఇప్పుడు చేస్తున్న సినిమాలకు ఉపయోగపడుతుంది. అందుకే అతను ఛావా, దురంధర్ లాంటి సినిమాల్లో తన పాత్రలతో మెస్మరైజ్ చేస్తున్నాడు.

దృశ్యం 3 లో మార్పులు..

ఐతే ఇలాంటి టైం లో దృశ్యం 3 నుంచి అతని ఎగ్జిట్ పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. అదీగాక జైదీప్ కూడా వెబ్ సీరీస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు కాబట్టి అతనికి ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. మరి దృశ్యం 3 లో ఈ మార్పులు సినిమాపై ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయన్నది చూడాలి. దృశ్యం 3 తెలుగులో వెంకటేష్ చేయాల్సి ఉంది. అసలైతే మళయాళంతో పాటు తెలుగు, హిందీ ఒకేసారి మొదలు పెట్టాలనుకున్నాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్ కానీ వెంకటేష్ త్రివిక్రం సినిమాతో బిజీ అవ్వడంతో లైట్ తీసుకున్నాడు. అజయ్ దేవగన్ మాత్రం దృశ్యం 3 కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.

త్రివిక్రం సినిమా తర్వాత వెంకటేష్ దృశ్యం 3 చేసే అవకాశాలు ఉన్నాయి. ఐతే ఈసారి దృశ్యం 3 ని ఎవరు డైరెక్ట్ చేస్తారన్న సస్పెన్స్ కొనసాగుతుంది.

Tags:    

Similar News