సుకుమార్ తండ్రి జ్ఞాపకార్థం సొంత గ్రామంలో..!
టాలీవుడ్ దిగ్గజ దర్శకుల జాబితాలో సుకుమార్ ముందు వరుసలో ఉంటాడు అనడంలో సందేహం లేదు. సుకుమార్ సినిమాలతో సూపర్ హిట్స్ దర్శకుడిగా పేరు దక్కించుకోవడమే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఎన్నో సార్లు సుకుమార్ పేరు దక్కించుకున్నాడు. సుకుమార్ పాండమిక్ సమయంలో తన గ్రామ వాసులకు ఆక్సీజన్ కు సంబంధించిన అవసరాలను తీర్చడం మొదలుకుని గ్రామంలోని నిరు పేదలకు కావాల్సిన సాయంను అందించాడు. గ్రామంలో ప్రతి ఒక్కరితో కూడా సన్నిహిత్యం కలిగి ఉన్న సుకుమార్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. గ్రామంలో దాదాపుగా 20 లక్షలు ఖర్చు పెట్టి స్కూల్ అదనపు భవనంను నిర్మించారు.
స్కూల్ అవసరాల కోసం సుకుమార్ ప్రత్యేక భవనంను నిర్మించి ఇవ్వడంతో గ్రామస్తులు అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేడు స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రుల చేతుల మీదుగా ఈ స్కూల్ భవనంను ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఈ స్కూల్ నిర్మాణం మాత్రమే కాకుండా సుకుమార్ గ్రామంలో తన తండ్రి జ్ఞాపకార్థం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సుకుమార్ సొంత గ్రామంలోనే కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో కూడా తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలను నిర్వహించాడు. ఇప్పటి వరకు సుకుమార్ భారీ ఎత్తున ఖర్చు చేసి మౌళిక వసతుల మొదలుకుని ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను సుకుమార్ సొంత ప్రాంతం కోసం చేశాడు అంటూ స్థానికులు చెబుతున్నారు. సుకుమార్ తమ ప్రాంతం వాసి అవ్వడం మాకు గర్వ కారణం అంటూ స్థానికులు చెబుతున్నారు.
సొంత ఊరు అనే భావనతో లక్షలు ఖర్చు చేస్తూ సేవా కార్యక్రమాలు మరియు అభివృద్ది కార్యక్రమాలు చేయడం అంటే నిజంగా అభినందనీయం. ఈ విషయంలో సుకుమార్ తప్పకుండా మంచి మనసు ఉన్న వ్యక్తిగా పేరు దక్కించుకున్నాడు. సుకుమార్ మాదిరిగా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు మరియు ఇతర రంగాల్లో అభివృద్ది చెంది ఉన్నత స్థాయిలో ఉన్న వారు తమ సొంత గ్రామం.. సొంత ప్రాంతంను అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ పిలుపునిస్తున్నారు.
ఇక సుకుమార్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాలున్న పుష్ప సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మరో షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తి అవుతుందని ఇటీవలే యూనిట్ సభ్యులు ఒకరు ఆఫ్ ది రికార్డ్ చెప్పుకొచ్చారు. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సుకుమార్ మరో వైపు నిర్మాతగా కూడా తన వంతు నిర్మాణ సహకారం అందిస్తూ సినిమాలు చేస్తున్నాడు. ఉప్పెన సినిమా కు నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథ మరియు స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా వర్క్ చేశాడు. ఆ సినిమా తో సుకుమార్ కు భారీగా లాభాలు వచ్చాయి. సుకుమార్ మరిన్ని సినిమాలను నిర్మిస్తున్నాడు. సుకుమార్ పుష్ప రెండు పార్ట్ లుగా తీయబోతున్నాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా ఉంటుందని అంటున్నారు.