మూడో రోజు కూడా తగ్గని 'ఛాంపియన్'

రోషన్ కి ఇది మూడో సినిమా అయినప్పటికీ, ఈ సినిమా స్కేల్, మేకింగ్ పరంగా చూస్తే ఒక గ్రాండ్ రీ లాంచ్ లాంటిదే అని చెప్పాలి.;

Update: 2025-12-28 08:32 GMT

రోషన్ మేక హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన 'ఛాంపియన్' సినిమా బాక్సాఫీస్ దగ్గర తన పట్టు నిలుపుకుంటోంది. విడుదలైన మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ ప్రభావం కలెక్షన్స్ మీద పడకుండా చూసుకోవడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా మూడో రోజు కూడా ఈ సినిమా వసూళ్లలో డ్రాప్ లేకుండా స్ట్రాంగ్ హోల్డ్ ని మెయింటైన్ చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.



 


సినిమా రిలీజ్ కి ముందు మేకర్స్ చేసిన భారీ ప్రమోషన్స్ ఇప్పుడు బాగా ప్లస్ అవుతున్నాయి. ముఖ్యంగా చార్ట్ బస్టర్ గా నిలిచిన 'గిర గిర' సాంగ్ ఆడియెన్స్ ని థియేటర్లకు రప్పించడంలో కీ రోల్ ప్లే చేస్తోంది. రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్, అనశ్వర రాజన్ గ్లామర్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీంతో మౌత్ టాక్ నెమ్మదిగా మెరుగుపడుతూ వస్తోంది.

రోషన్ కి ఇది మూడో సినిమా అయినప్పటికీ, ఈ సినిమా స్కేల్, మేకింగ్ పరంగా చూస్తే ఒక గ్రాండ్ రీ లాంచ్ లాంటిదే అని చెప్పాలి. ప్రస్తుతం బుక్ మై షోలో కూడా ఈ సినిమా బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. పండగ సీజన్ కాకపోయినా, మిగతా సినిమాల కంటే 'ఛాంపియన్' కే ఆడియెన్స్ ఓటు వేస్తున్నారు. ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో ఈ సినిమాకి ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది.

కలెక్షన్స్ విషయానికి వస్తే సినిమా రేంజ్ ఏంటో అర్థమవుతుంది. చిత్ర బృందం విడుదల చేసిన లేటెస్ట్ పోస్టర్ ప్రకారం.. 'ఛాంపియన్' మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8.89 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం మూడో రోజే దాదాపు 2 కోట్లు వసూలు చేయడం సినిమా స్టామినాను చూపిస్తోంది. మిక్స్డ్ టాక్ తో మూడు రోజుల్లోనే దాదాపు 9 కోట్లకు చేరువవ్వడం అంటే మామూలు విషయం కాదు.

ఆదివారం కూడా బుకింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో ఫస్ట్ వీకెండ్ నంబర్స్ భారీగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే రోషన్ కమర్షియల్ గా సేఫ్ జోన్ లోకి వెళ్తున్నట్లే కనిపిస్తోంది. టాక్ తో సంబంధం లేకుండా మాస్, యూత్ ఆడియెన్స్ ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు.

'ఛాంపియన్' బాక్సాఫీస్ పరుగు పాజిటివ్ గానే ఉంది. ఈ వీకెండ్ గడిస్తే సినిమా కమర్షియల్ హిట్ స్టేటస్ కి దగ్గరయ్యే ఛాన్స్ ఉంది. సోమవారం నుంచి సినిమా జోరు ఎలా ఉంటుందనే దాన్ని బట్టి లాంగ్ రన్ డిసైడ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే రోషన్ బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచేలా ఉన్నాడు.

Tags:    

Similar News